
చంద్రబాబునాయుడు పైకి బింకంగా ఉన్నారా? నిజంగానే ఆయన ధీమాగా ఉన్నారా? ఇదీ తెలుగుతమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్నలు. గత కొద్దిరోజులుగా చంద్రబాబునాయుడు గెలుపు తెలుగుదేశం పార్టీదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి తానేంటో చూపిస్తానని కూడా అనడం ఆయన గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నారనడానికి నిదర్శనమంటున్నారు పార్టీ నేతలు. క్రైసిస్ సమయంలోనూ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండటం చంద్రబాబు నాయుడు ప్రత్యేకతగా చెబుతుంటారు. సంక్షోభాలనే తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట ఆయన.
నాలుగు సర్వేల ఫలితాలు….
అలాంటి చంద్రబాబునాయుడు ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షల్లో చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌంటింగ్ కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా చంద్రబాబు తన వద్ద నాలుగు సర్వేల ఫలితాలు ఉన్నాయనడం తెలుగుతమ్ముళ్లకు కొంత ఊరటనిస్తోంది. నాలుగుసర్వేల్లోనూ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఫలితాలు వచ్చాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
లగడపాటి, మీడియా సంస్థ….
ఇందులో రెండు సర్వేలు ప్రత్యేక సంస్థ ద్వారా చేయించినవి కాగా, ఒక సర్వే మాత్రం ప్రముఖ మీడియా నిర్వహించిన సర్వే అని తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పేరున్న మీడియా జరిపిన సర్వేలో చంద్రబాబుకు 95 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో అప్పట ినుంచి చంద్రబాబు కొంత ఉత్సాహంగా ఉన్నారంటున్నారు. దీంతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలో కూడా బాబుకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయంటున్నారు.
అందుకే ఆ ధీమా….
ఇలా నాలుగు సర్వేలు తనకు అనుకూలంగా రావడంతో చంద్రబాబు పార్టీ సమీక్షల్లో క్యాడర్ కు, నేతలకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నారు. సమీక్షలకు వెళ్లి వచ్చిననేతలు బాబులో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతుండటం విశేషం. అందుకే ఆయన ఈసారి తన పనితీరు డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఎవరికీ భయపడే ప్రస్తక్తి లేదని అంటున్నారు. అంతేకాదు ఇకపై కార్యకర్తల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటానని, సీనియర్ నేతలయినా ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టే వారికి పదవులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాలుగు సర్వేలు ఏమిటో తెలుసుకునేందుకు టీడీపీ నేతలు తెగ ఉత్సాహం చూపిస్తుండటం విశేషం.
Leave a Reply