
రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్చలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న అడుగులు, ఆయన మార్చుకుంటున్న పంథాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వంటి వాటిపై హాట్ హాట్ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన పదిహేను రోజుల్లో మారిన చంద్రబాబు వ్యూహంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సీఎం చంద్రబాబు దేశాన్ని ఏకం చేస్తున్నారని పైకి ప్రచారం జరుగుతున్నా.. ఆయన చేస్తున్న ప్రక్రియ వెనుక సొంత లాభమే కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ప్రభుత్వాన్నిదించాలనే లక్ష్యంగా ఆయన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు పిలుపుతో బీజేపేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి.
గత ఎన్నికల్లో…..
ఈ పక్రియలో భాగంగా చంద్రబాబు దూకుడు పెంచారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నారు. అయితే, ఇదంతా.. కూ డా ఏపీలో తాను తిరిగి అదికారంలోకి వచ్చేందుకు వేసిన వ్యూహంగానే విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను కైవసం చేసుకుని విపక్షానికి పరిమితమైంది. అయితే, ఈ స్థానాల్లో ఎక్కువగా కాంగ్రెస్ కంచుకోటలే ఉన్నా యి. నిజానికి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో తుడిచి పెట్టుకుపోయింది. అయినా కూడా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు మాత్రం పదిలం. అయితే, విభజన వేడితో .. ఈ ఓటు బ్యాంకు మొత్తంగా జగన్ వైపు మళ్లింది. ఫలితంగా జగన్‌కు 67 స్థానాలు దక్కాయి. అదే ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొంటే.. పరిస్తితి తనకు అనుకూలంగా మారడం ఖాయమనేది బాబు వ్యూహంలో భాగమని చెబుతున్నారు విశ్లేషకులు.
సొంత లాభం లేదంటున్నా….
పైకి మాత్రం.. తాను చేస్తున్న ప్రయత్నంలో సొంత లాభం లేదని బాబు అంటున్నా..ఎన్నికల వేళ.. అందునా ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలనే వ్యూహంతో ఉన్న చంద్రబాబు సమయాన్ని ఎవరికోసమో వృధా చేసుకోరనే వాదన వినిపిస్తోంది. పైగా.. కేంద్రంలో చక్రం తిప్పడమే తప్ప తనకు ప్రధాని పీఠంపై ఆశలు లేవని ఆయనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాలికి బలం కట్టుకుని రాష్ట్రాలు తిరుగుతూ.. కాంగ్రెస్ అనుకూలురులను తనవైపు మళ్లించుకుం టున్నారు అంటూ.. ఖచ్చితంగా బాబు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై కన్నేశారనే విషయం అర్ధమవుతోంది. అదేసమయంలో తనపై ఎన్నికల వేళ విమర్శలను సాధ్యమైనంత తగ్గించుకునేందుకు కూడా బాబు ప్లాన్ చేశారని చెబుతున్నారు.
తనను విమర్శించే వీలు లేకుండా….
కాంగ్రెస్‌తో జట్టు కట్టడం ద్వారా.. ఆ పార్టీ నేతలు ఏపీలోనూ చంద్రబాబును విమర్శించే ఛాన్స్ పోయినట్టే. నిన్న మొన్నటి వరకు వరుస లేఖలతో, విమర్శలతో సెంట్రాఫ్ది మ్యాన్‌గా ఉన్న కేవీపీ రామచంద్రరావు.. కాంగ్రెస్ అధినేత రాహుల్.. చంద్రబాబుతో చేతులు కలపగానే.. మౌనం వహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయన తెరమరుగయ్యారు కూడా. ఇక, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా కూడా విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు బాబుకు ఓట్లతోపాటు ఇలా. తనను విమర్శించే వారు తగ్గిపోవడమే కావాల్సింది. మరోపక్క, కాంగ్రెస్-టీడీపీ కూటమి కట్టాయంటే.. కాంగ్రెస్‌ను అభిమానించే ప్రజలు వైసీపీకి దూరమై.. టీడీపీకి ఓట్లు వేస్తారనేది మరో వ్యూహం. దీంతో సునాయాసంగా ఏపీలో త్రిముఖ పోరు నడిచినా.. బాబు విజయం ఖాయమవుతుందని టీడీపీ నేతల విశ్లేషణ. సో.. ఏదేమైనా.. బాబు మాత్రం చాలా పెద్ద గోల్ పెట్టుకునే కాంగ్రెస్‌తో చేతులు కలిపారనే విషయానికి బలం చేకూరుతోంది.
Leave a Reply