బాబు ఇప్పటికి తెలుసుకున్నట్లుందే…!

చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను 9 ఏళ్ళు గతంలో ప్రజలు మెచ్చుకునేవారు. తప్పుచేసి పాలన యంత్రాంగానికి చుక్కలు చూపించే పాలన అందించేవారు చంద్రబాబు. అంతే కాదు జన్మభూమి కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో అమలయ్యేలా ఒక చైతన్యం తెచ్చేవారు బాబు. ఇక శ్రమదానం ఆలోచన బాబుకు క్రేజ్ ఒక రేంజ్ లో తెచ్చిపెట్టింది. కానీ 2014 నుంచి చంద్రబాబు సరికొత్తగా మారిపోయారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన ప్రతి అంశం రాజకీయ కోణంలో చూడటం, మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు అనే భయం ఉండేది. చిత్రంగా బాబు సీన్ రివర్స్ అయ్యింది. పాలన గాడి తప్పింది అనేది అనేక వర్గాల విమర్శలు ఆరోపణలు.

ఎక్కడా ఏ చర్యలు లేవు …?

పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. అధికారుల మీద, ప్రజా ప్రతినిధులపై ఒక్క చర్య లేదు. ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా అధికారిని పై దాడికి పాల్పడినా వ్యవహారం, ఎంపీ కేశినేని నాని తన బస్సులు ఆపారంటూ రవాణాఅధికారిపై ఎమ్మెల్యే బోండా ఉమా తో హల్ చల్ చేసినా అడిగే దిక్కు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్య పాలన బాబు గతంలో ఎన్నడు చేయలేదు. అందుకే ఉభయరాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అంతా చంద్రబాబు ను అభిమానించేవారు. దురదృష్టం ఇప్పుడు ఆయనకు ఆ సీన్ లేకుండా అయిపొయింది అంటున్నారు విశ్లేషకులు.

ఎన్నికలకు సమయం…..

ఎన్నికలకు ఏడాదిమాత్రమే సమయం వుంది. దాంతో బాబు రూట్ మార్చి ప్రజా బాట పట్టారు. రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే పనిలో బిజీ అయ్యారు తాజాగా ఏపీలో నగదు కొరత పనిచేయని ఏటీఎం ల చుట్టూ జనం ప్రదక్షిణలపై బాబు దృష్టి పెట్టారు. బ్యాంకర్లను సమావేశ పరిచి ఆర్బీఐ ని నిలదీశారు. బ్యాంకర్లపై ఒకరకంగా తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లావాదేవీలపై ఎక్కువ పన్నులు వేయడం తో ఖాతాదారులు తిరిగి నగదు లావాదేవీలే చేస్తారని వెల్లడించారు. ఇలా బాబు ప్రజా సమస్యలపై నిత్యం కొనసాగితే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి అని రాజకీయ విశ్లేషకుల మాట.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1672 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*