
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ నంద్యాల, కర్నూలు అర్బన్ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. నంద్యాల లో భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నంద్యాల టిక్కెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే తనకు టిక్కెట్ దక్కకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని భూమా బ్రహ్మానందరెడ్డి చెబుతున్నారు. ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఖచ్చితంగా తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు భూమా బ్రహ్మానందరెడ్డ స్పష్టంగా చెప్పారు.
భవిష్యత్ కార్యాచరణపై…..
మరోవైపు నిన్న కర్నూలులో కార్యకర్తలతో సమావేశమైన ఎస్వీమోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకున్నారు. తాను పోటీలో ఉండేది ఖాయమన్నారు. తనకు టిక్కెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నానని, టిక్కెట్ దక్కకుంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పారు. కర్నూలు అర్బన్ నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే భూమా ఫ్యామిలీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను రెండో లిస్టులోనూ బాబు పక్కన పెట్టేశారు. దీంతో కర్నూలు జిల్లాలో మరింత టెన్షన్ నెలకొంది.
Leave a Reply