బంధం గట్టిదేనా…!?

narendra-modi-ys-jaganmohanreddy

కేంద్రంలో మళ్ళీ రెండవమారు ప్రధానిగా బంపర్ మెజారిటీతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో ఎపుడూ ఇంతవరకూ అపజయం ఎరుగని వీరుడుగా నిలిచారు. ఇది భారత రాజకీయాల్లో కొత్త రికార్డ్. తొలి రోజుల్లో పండిట్ నెహ్రూకి ఈ రికార్డ్ ఉండేది. ఇక మోడీ విషయానికి వస్తే ఆయన ఈనాడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడుగా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా మోడీ ప్రభ అలా వెలిగిపోతోంది.

జగనానందం…..

ఏపీ విషయానికి వస్తే జగన్ తొలిసారి సీఎం అయ్యారు. అయినా ఆయన అద్భుతమైన విజాయాన్ని దక్కించుకుని దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు. చంద్రబాబుని ఓడించిన వీరుడిగా మోడీ దగ్గర జగన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి తోడు జగన్ వ్యవహారశైలి కూడా ఇపుడు మోడీని బాగానే ఆకట్టుకుంటోంది. వేరే పార్టీకి చెందిన సీఎం తనకు పాదాభివందనం చేయడం మోడీ లాంటి నాయకుని మనసును పూర్తిగా సంతృప్తిపరచేదే. జగన్ మోడీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని భావించాలి. చంద్రబాబు మోడీ కంటే ఆరు నెలలు పెద్ద. రాజకీయాల్లో మోడీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి వాటిలో పనిచేయడం తీసుకుంటే బాబు కంటే సీనియర్ అని చెప్పాలి. కానీ బాబు ముఖ్యమంత్రి కుర్చీని కొలమానం చేస్తారు. దాంతో బాబు మోడీ కంటే ఆరేళ్ళు ముందు సీఎం అయ్యారు. ఆ విధంగా ఆయన సీనియర్. ఇదే విషయంలో బాబు, మోడీల మధ్య ఇగో ప్రాబ్లం వచ్చేది. అది రాష్ట్ర సంబంధాలు, రాజకీయ సంబంధాలు కూడా దెబ్బతీసేలా సాగింది.

ఈ బంధం గట్టిదేనా….?

ఇపుడు జగన్ కి సీనియారిటీ గొడవలు లేవు. వయసు రీత్యా కూడా మోడీ కంటే 22 ఏళ్ళు చిన్న వారు. పుత్ర సమానుడు. దాంతో పాటు రాజకీయంగా కూడా యువతరం ప్రతినిధి. ఈ లెక్కన చూస్తే మోడీ జగన్ బంధం బాగానే కుదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోడీని ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ఇప్పటివరకూ బాగానే ప్రయత్నం చేశారన్నది ఏపీ ప్రజల మాట. మోడీ సైతం జగన్ పట్ల శిష్య, పుత్ర వాత్సల్యం చూపిస్తున్నారు. దీంతో సీఎం, పీఎం కంటే కూడా వ్యక్తిగత బంధాలు ఇక్కడ బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది రాష్ట్రానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. మోడీతో కయ్యం వద్దు అని ప్రజలు టీడీపీని ఓడించి, జగన్ని గెలిపించడం ద్వారా కచ్చితమైన తీర్పు ఇచ్చారు. అందువల్ల జగన్ కేంద్రంతో, మోడీతో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం అందరూ హర్షించచదగ్గది. ప్రధాని జగన్ కోసం తిరుమలలో ఒక నిముషం పాటు వేచి ఉండడం చూస్తే ఏపీకి మోడీ మంచి చేసేలా ఉన్నారనిపిస్తోంది. జగన్ రూపంలో అది సాకారం అయితే అంతకంటే కావాల్సినదేముంది.

Ravi Batchali
About Ravi Batchali 18150 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*