పల్లెకు పట్టు తప్పుతోందా….??

palle-raghunadhareddy-putaparthi-constiuency

పుట్టపర్తి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు సార్లు తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాధరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో నల్లమడ నియోజవర్గంలో పుట్టపర్తి ఉండేది. అయితే 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పల్లె రఘునాధరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2009లో కేవలం వెయ్యి ఓట్ల ఆధిక్యతతో గెలిచిన పల్లె, 2014 లో మాత్రం 6,964 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

హ్యాట్రిక్ కొట్టాలని….

ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు పల్లె రఘునాధరెడ్డి. పల్లె రఘునాధరెడ్డి 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో పనిచేశారు. తర్వాత జరిగిన విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయినా చీఫ్ విప్ పదవి ఇచ్చి చంద్రబాబు పల్లెను సంతృప్తి పర్చారు. నిజానికి పల్లె రఘునాధరెడ్డిపై తీవ్ర అసంతృప్తి నియోజకవర్గంలో ఉందని టీడీపీ అధిష్టానమే లీకులు వదిలింది. పల్లెకు టిక్కెట్ రాదని కూడా ప్రచారం జరిగింది. పల్లెకు వ్యతిరేకంగా అక్కడ తెలుగుతమ్ముళ్లు భారీ ప్రదర్శనలు, సభలను సయితం నిర్వహించారు. అయినా చంద్రబాబు చివరకు పల్లెకు టిక్కెట్ ఇచ్చారు.

ఇద్దరు రెబెల్స్…..

కానీ ఇప్పడు నామినేషన్లు పూర్తయ్యాక పల్లెకు తెలుగుతమ్ముళ్ల దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా ఇద్దరు నేతలు నామినేషన్లు వేసి రెబల్ గా బరిలో నిలిచారు. పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లెల జయరాం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.పల్లెను ఓడించడమే తన ధ్యేయమంటున్నారు జయరాం. అలాగే పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ టీసీ గంగన్న కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన కూడా పల్లె రఘునాధరెడ్డికి వ్యతిరేకంగానే నామినేషన్ వేశారు.

అదే జరిగితే….

అయితే ఈ ఇద్దరి దెబ్బ పల్లెకు తగులుతుందన్నది టాక్. పల్లె రఘునాధరెడ్డికి హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు అస్సలు పొసగదు.నిమ్మల కిష్టప్ప వర్గం పల్లెకు సహకరించేందుకు సిద్ధంగా లేదు. పల్లె పై ఇంత అసంతృప్తి పెరగడానికి ఆయన స్వయంకృతాపరాధమే నంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తమను పట్టించుకోకుండా కేవలం ఒక వర్గానికే మద్దతిచ్చారన్నది వారి ఆరోపణ. ఇప్పుడు తమకు సమయం వచ్చిందంటున్నారు. వారు ఈనియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గా శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి పోలింగ్ సమయానికి పల్లెకు ఈ రెబల్స్ బెడత తప్పితే సరి. లేకుంటే పల్లెకు కష్టకాలమే మరి.

Ravi Batchali
About Ravi Batchali 25609 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*