జనసేననే ఎందుకు ఎంచుకున్నారు…??

ఓ వైపు ఏపీలో కాంగ్రెస్ ఏదో బాగుపడుతుందని, రేపటి రోజులు తమవేనని కలలు కంటున్న హస్తం పెద్దలకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు ఆ పార్టీలో అరకొరగా మిగిలిన సీనియర్లు. వీరంతా విభజన తరువాత కూడా కాంగ్రెస్ లో ఉన్న నాయకులే. మరి ఇంతలో ఏమొచ్చిదో ఏమో కానీ ఎన్నికల వేళ పార్టీ మారాలనుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తున్న వారంతా ఇపుడు మూడో పార్టీ జనసేనకు జై అంటున్నారు.

బాలరాజు ఎందుకు వెళ్లారంటే…

విశాఖ జిల్లా రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా, మంత్రిగా ఉన్న పసుపులేటి బాలరాజు జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీలో చేరే ముందు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మరీ అభిప్రాయం తెలుసుకున్నారు. ఇన్నాళ్ళు ఓర్చి కాంగ్రెస్ కి సేవలు చేశామని, అయినా ఉపయోగం లేదని బాలరాజు కార్యకర్తల వద్ద ఆవేదన చెందినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ కి కష్టకాలంలో కాపుగా ఉంటే పార్టీ ఏ మాత్రం ఎదిగే అవకాశాలు లేకుండా పోయిందని అన్నట్లు భోగట్టా. . అందుకే జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు ఆయన క్యాడర్ కి దిశానిర్దేశం చేశారని అంటున్నారు.

గంటాతో వైరం…..

బాలరాజు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో ఉండగా అపుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుతో తీవ్రమైన విభేధాలు ఉండేవి. బాలరాజును గంటా అసలు లెక్క చేసేవారు కాదు, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన గంటా తన హవాను అక్కడ బలంగా చాటుకోవడంతో అప్పటివరకూ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన బాలరాజు షాడో అయిపోయారు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్యన మాటలు కూడా లేని వాతావరణం ఏర్పడింది. గంటా కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వెళ్ళిపోవడంతో బాలరాజు హస్తం పార్టీలోనే కొనసాగారు.

టీడీపీతో కుదరని పని….

అందువల్లనే బాలరాజు టీడీపీ కాంగ్రెస్ పొత్తుని వ్యతిరేకిస్తున్నారట. ఆ పార్టీతో పొత్తు అంటే కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమేనని కూడా భావిస్తున్నారుట. పైగా కాంగ్రెస్ కి ఏపీలో ఏమీ లేదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారని టాక్. జనసేన నుంచి ప్రతిపాదనలు రావడంతో బాలరాజు దాన్ని అంగీకరించారని అంటున్నారు. ఆందుకే ఆయన జనసేన కండువాను ఈరోజు కప్పుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కూడా ఉన్న బాలరాజు పార్టీని వీడటంతో అది హస్తం పార్టీకి ఇబ్బందికరమే. పేరున్న నాయకులు జిల్లాలో లేనట్లే. మరో వైపు గిరిజన వర్గానికి చెందిన బాలరాజు కు పాడేరు టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే విశాఖ జిలాలో పార్టీ దారుణంగా దెబ్బ తినడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 30085 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*