నిలకడ లేని నేత… ఆవేశమే తప్ప?
పవన్ కల్యాణ్ స్థిరమైన రాజకీయాలు చేయలేరన్నది మరోసారి స్పష్టమయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వెనక్కు తగ్గడం ఆయన బలహీనతకు [more]
పవన్ కల్యాణ్ స్థిరమైన రాజకీయాలు చేయలేరన్నది మరోసారి స్పష్టమయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వెనక్కు తగ్గడం ఆయన బలహీనతకు [more]
పవన్ కల్యాణ్ స్థిరమైన రాజకీయాలు చేయలేరన్నది మరోసారి స్పష్టమయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వెనక్కు తగ్గడం ఆయన బలహీనతకు అద్దం పడుతుంది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయమని పవన్ కల్యాణ్ ను అడగలేదు. ఆయనంతట ఆయనే పోటీ చేయాలని కార్యకర్తల నుంచి వత్తిడి వస్తుందని,పోటీకి దిగుతామని ప్రకటించారు.
పోటీకి సై అని…..
పవన్ కల్యాణ పోటీ చేస్తామని ప్రకటించగానే గ్రేటర్ లోని జనసేన కార్యకర్తలు ఉత్సాహానికి అదుపులేకుండా పోయింది. గెలుపు సంగతి పక్కన పెడితే తమ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుండటం తమకు భవిష్యత్ లో కలసి వస్తుందని జనసైనికులు భావించారు. బీజేపీ తో కలసి పోటీ చేస్తే కొన్ని చోట్లైనా గెలిచి గ్రేటర్ లో తమ ప్రాతినిధ్యం ఉంటుందని ఆశపడ్డారు. కానీ పవన్ కల్యాణ్ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఎవరడిగారని?
అసలు ఎవరడిగారని పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ ప్రకటించారు. ఏపీలో బీజేపీతో ఎవరిని అడగకుండానే పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పార్టీలో అనేక మంది అప్పట్లోనే నిరసించారు. సోషల్ మీడియాలో సయితం పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ఆయన అభిమానులే తప్పు పట్టారు. నాలుగేళ్లకు ముందే కమలం పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు కూడా తలెత్తాయి.
అనాలోచితంగా…..
ఇప్పుడు కూడా తొలి ప్రకటనే తాము పోటీకి దిగడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించి ఉండే గౌరవంగా ఉండేది. కానీ పవన్ దుందుడుకు నిర్ణయాలు, అనాలోచిత, ఆవేశ ప్రకటనలు ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని చెప్పక తప్పదు. పవన్ నిర్ణయాలు కార్యకర్తల్లో నిరాశను కలగచేస్తున్నాయి. పవన్ కల్యాణ్ లో రాజకీయ పరిణితి ఇంకా రాలేదని కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ ఒక నిలకడలేని నేతగానే మిగిలిపోతున్నారు.