ఆ మంత్రులపై పవన్ ‘‘పంజా’’

జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ? ఇప్ప‌టికీ ఒక స్ప‌ష్టమైన లెక్క లేక‌పోయినా.. ఆయా జిల్లాల్లో మాత్రం ఇత‌ర పార్టీల నాయ‌కుల హ‌డ‌లెత్తిపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో పాటు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ హ‌వా కూడా కొంత మంది విజ‌యంలో కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన ఒంటరిగానే బ‌రిలోకి దిగుతుండ‌టం.. కాపు సామాజిక‌వ‌ర్గం ఆయ‌న వెనుక న‌డుస్తుంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్న త‌రుణంలో.. వీరిలో ఆందోళ‌న మొద‌లైంది. పైకి మేక‌పోతు గాంభీర్యం ఒల‌క‌బోస్తున్నా.. లోప‌ల మాత్రం బెద‌రిపోతు న్నార‌ని అనుచ‌రులు చెబుతున్నారు. ఇంకో ఆసక్తిక‌ర‌మైన అంశ‌మేంటంటే.. ఇలాంటి వారిలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న‌వారే అధికంగా ఉన్నార‌ట‌. మొత్తం ఐదారుగురు మంత్రుల‌దీ ఇదే దారి అని చెబుతున్నారు. ప‌వ‌న్ చ‌రిష్మా.. వీరి విజ‌యంలో కీల‌కంగా మారింద‌నేది బ‌హిరంగ స‌త్య‌మే! దీంతో ఈ మంత్రుల‌కు ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు ఎమ్మెల్సీలుగా ఉన్నా.. మిగిలిన న‌లుగురు మాత్రం ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కోవాలా అని లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌.

అయ్యన్నకు అదే భయమా…?

గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. టీడీపీకి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోయాయి. కొంద‌రు అభ్య‌ర్థుల గెలుపులో.. టీడీపీ హ‌వా ఎంత ఉందో ప‌వ‌న్‌దీ అంతే స్థాయిలో ఉంది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. జ‌న‌సేన ఒంట‌రిగానే బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాబు మంత్రి వ‌ర్గంలోని కొంద‌రు మంత్రులకు ఎన్నికల భయం పుడుతోందట. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా ? లేదా అన్న ఆందోళన వీరిలో స్పష్టంగా కనిపిస్తోందట. ముఖ్యంగా ప‌వ‌న్‌ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న మంత్రుల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. గతంలో పవన్ మద్దతుతో విజయం సాధించిన వారిలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌ట‌. 2004లో చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తమైనా అయ్యన్న విజయం సాధించగలిగారు. కానీ 2009లో ప్రజారాజ్యం ప్రభావంతో ఓడిపోయారు. మళ్లీ అదే ప్రభావం పనిచేస్తే అయ్యన్న గెలుపు క‌ష్ట‌మే అని అనుచ‌ర‌గ‌ణం ఆందోళన చెందుతున్నారు.

అచ్చెన్న జడుస్తుంది ఇందుకే……

శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా 2009లో ఓడిపోయి 2014లో పవన్‌ ప్రభావంతో విజయం సాధించారు. ఇక 2004లో విజయం సాధించిన యనమల 2009లో ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్సీ అయి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు. మళ్లీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు ఇదే పరిస్థితి ఎదురవుతుంద‌ట‌. ఇక‌ డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజ‌క‌వ‌ర్గ‌మైన పెద్దాపురంలో జనసేన ప్రభావం అధికంగా ఉండొచ్చ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. తొలి నుంచి రాజప్పపై అన్ని వర్గాల ఓటర్లల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. అయితే పవన్‌ ప్రభావం పనిచేస్తే ఇక్కట్లు తప్పవనేది అనుచ‌రుల మాట‌. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవ‌డానికి ప్రజారాజ్యం చీల్చిన ఓట్లే కారణం. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో 2014లో పవన్‌ ప్రభావంతో టీడీపీ అభ్యర్థి కొల్లు ర‌వీంద్ర‌ విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇక్కడ జనసేన అభ్యర్థి రంగంలోకి దిగితే కొల్లుకు ఓటమి తప్పదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

కాల్వకు కష్టమేనా….?

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఓటమి భయం పట్టుకుందట. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీలు గోవింద్‌రెడ్డి, దీపక్‌రెడ్డిల సహకారం లేకుంటే ఓటమి తప్పదు. ఇక్క‌డి నుంచి మళ్లీ తానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోవింద్‌రెడ్డి చెబుతున్నారట. తనకే సీటు ఇవ్వాల‌ని, ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి నష్టపోయాయని తానే బరిలో ఉంటానని దీపక్‌రెడ్డి చెబుతున్నారట. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 1700 ఓట్ల‌తో గెలిచిన కాలువ ఈ సారి గ్యారెంటీగా నియోజ‌క‌వ‌ర్గం మార‌తార‌ని అంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ జనసేన ప్రభావం ఉండదని చెబుతున్నా.. ఆ ప్రభావం పొంచి ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. ప్ర‌స్తుత పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందోన‌ని అంతా ఆందోళ‌న చెందుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 39319 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*