తమ్ముడు మహా ముదురు
సహజంగా అన్న కంటే తమ్ముడికి తెలివి ఎక్కువ అంటారు. అన్న వేసే తప్పటడుగులు, తప్పుడు పనులు చూసి వెనకాల పుట్టిన తమ్ముడు జాగ్రత్త పడతారు అని చెబుతారు. [more]
సహజంగా అన్న కంటే తమ్ముడికి తెలివి ఎక్కువ అంటారు. అన్న వేసే తప్పటడుగులు, తప్పుడు పనులు చూసి వెనకాల పుట్టిన తమ్ముడు జాగ్రత్త పడతారు అని చెబుతారు. [more]
సహజంగా అన్న కంటే తమ్ముడికి తెలివి ఎక్కువ అంటారు. అన్న వేసే తప్పటడుగులు, తప్పుడు పనులు చూసి వెనకాల పుట్టిన తమ్ముడు జాగ్రత్త పడతారు అని చెబుతారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే ఉంది మెగా తమ్ముడి కధ. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. పోటీ చేసే 18 సీట్లు, 70 లక్షల ఓట్లు కూడా దక్కాయి. కానీ ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాని ఫలితం కేంద్ర మంత్రి పదవి, అంతటితో చిరంజీవి రాజకీయ జీవితం కట్ అయిపోయింది. తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం అలా చేయడేంలేదు. ఎంతో తెలివిగా ఒడుపుగా వ్యూహాలు పన్నుతున్నాడు.
బడ్జెట్ భేష్ ట ….
పొత్తు పార్టీగా ఉంటూనే బీజేపీ అధికారాన్ని మాత్రం బాగా వాడుకుంటున్నాడు. తానే కేంద్రంలో పవర్ లో ఉన్నట్లుగా బాగానే సీన్ క్రియేట్ చేస్తున్నాడు. అంతటితో ఆగుతున్నాడా. అసలైన బీజేపీ నేతల కంటే కూడా కాషాయం పార్టీని ఎక్కువగా పొగిడేస్తున్నాడు. బీజేపీలో నాయకులు కూడా తామెపుడూ మోడీ, అమిత్ షాలను ఇంతలా కీర్తించలేదని ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఏపీకి బీజేపీ చిల్లి గవ్వ ఇవ్వడంలేదు, ఆ బాధ ఏపీలో బాధ్యత కలిగిన బీజేపీ నేతలకు కూడా ఉంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ బడ్జెట్ భేష్ అంటున్నారు. ఇంతకంటే మంచి బడ్జెట్ లేదని చెప్పేస్తున్నారు. ఏపీకి పైసా ఇవ్వని బీజేపీ మంచిదిట. అడగని పాపం మాత్రం వైసీపీదిట. ఇదీ పవన్ కల్యాణ్ ముదురు రాజకీయం.
పాచిపోలేదా మరి …
నాడు బీజేపీ ప్రత్యేక ప్యాకేజిని పాచిపోయిన రెండు లడ్డూలతో పోల్చిన నోటితోనే పవన్ కల్యాణ్ ఇపుడు పొగుడుతూంటే తట్టుకోవడం బహుశా జనసైనికులబడే పవన్ ఫ్యాన్స్ కే కష్టమేమో. ఎలాగైనా జగన్ ని తిట్టాలి. ఆయన్ని చెడ్డ చేసి అధికార పీఠమెక్కాలి. ఇదీ పవన్ కల్యాణ్ అజెండా. ఇందులో ఆయన ఏ మాత్రం మొహమాటపడడంలేదు. ముసుగు కూడా తీసేసి మరీ దర్జాగా కేంద్రానికి భజన చేసే కార్యక్రమన్ని మొదలెట్టేశారు. ప్రజలు, సామాజిక మార్పు, యువత, చైతన్యం, త్యాగాలు, పాతికేళ్ళ రాజకీయం, చెగువేరా లాంటి మాటలు గట్టిగా ఒకటికి పదిమార్లు అన్న పవన్ కల్యాణ్ మొత్తానికి తన దారి బాగానే తెలుసుకున్నాడని సెటైర్లు పడుతున్నాయి.
అలా ఉనికిలోనే…..
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మెగాస్టార్ కూడా పవన్ కల్యాణ్ లా పొత్తు పెట్టుకుంటే నచ్చని నాడు బయటకు వచ్చి మరో పార్టీతో జట్టు కట్టే చాన్స్ ఉంది. ఆయన అమాయకుడు కాబట్టి అలా చేయకుండా టోకున పార్టీని అలా అమ్మేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ అలా కాదు, తన పార్టీకి నాయకుడూ తానే, క్యాడరూ తానే, అయినా సరే ఏదో పార్టీ వెలిగిపోతోందని భ్రమింపచేస్తూ పొత్తులతో పెద్ద పార్టీలకే గేలం వేస్తున్నారు ఏపీలో టీడీపీ అధికారంలో లేదు కాబట్టి ఇపుడు కేంద్రంలో బీజేపీతో పొత్తు అంటున్నారు. రేపు ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతే మళ్ళీ నేనూ నా కుంపటి అన్నట్లుగా వేరే చోటకు వెళ్ళినా వెళ్తారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు అందనంత దూరం పవన్ కల్యాణ్ ఎపుడో వెళ్ళిపోయారు. అందుకే ఆయనకు బీజేపీ బడ్జెట్ తెగ నచ్చింది. ఏపీ జనం ఏమైపోయినా కూడా మోడీ గ్రేట్ అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ మారినట్లుగా ఏపీ జనం మారరు కదా. బీజేపీకి గత ఎన్నికల్లో కర్రు కాల్చి నోటాతో పక్కన పెట్టారు. జనసేనకు ఆరు శాతం ఓట్లు ఇచ్చారు. ఇపుడు కాషాయం పార్టీతో అంటకాగిన ఫలితం పవన్ కి కూడా ముందు ముందు రుచి చూపిస్తారేమో మరి.