వారికి క్లియరెన్స్ ఇచ్చేశారు…!!!

pawan-kalyan-janasena-tickets

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తూర్పు సెంటిమెంట్ కి శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ స్థానాల అభ్యర్థులుగా రాజమండ్రి నుంచి డాక్టర్ ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ లను ప్రకటించి దూకుడు పెంచారు. తూర్పుగోదావరి సెంటిమెంట్ కారణంగానే ఈ రెండు పార్లమెంట్ స్థానాలను ప్రకటించినట్లు కూడా అయన చెప్పుకొచ్చారు. బిజెపి రాజమండ్రి సిటీ ఎమ్యెల్యే గా పనిచేసిన డాక్టర్ ఆకుల సత్యరనారాయణ కు పార్లమెంట్ స్థానానికి ఇంతకుముందే డిసైడ్ అయిపోయినా అధికారికంగా పవన్ ప్రకటించడం విశేషం. ఆయన పార్టీలో చేరినప్పుడే ఎంపిగా పోటీ చేస్తారనే చర్చ నడిచింది.

డిఎంఆర్ శేఖర్ కి అమలాపురం …

ఓఎన్జీసీ అధికారిగా సేవలు అందిస్తున్న డిఎంఆర్ శేఖర్ ను వినూత్నంగా తెరపైకి తెచ్చారు పవన్ కళ్యాణ్. అమలాపురం సీటును ఆయనకు ఇస్తున్నట్లు ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. వివాదరహితుడిగా పేరొందిన శేఖర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆ దృష్ట్యా పలు పేర్లు పరిశీలించిన అనంతరం ఆయనకే టిక్ పెట్టారు పవన్.

ఆ… సీట్లకోసం ఆకుల వత్తిడి …?

తన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఆకుల సాత్యనారాయణ పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో రాజమండ్రి, రాజానగరం సీట్లు తానూ సూచించిన వారికే ఇవ్వాలని ఆకుల జనసేన అధినేత పై వత్తిడి పెంచుతున్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి డాక్టర్ అనసూరి పద్మలత, రాజానగరం నుంచి తన భార్య ఆకుల పద్మావతికి టికెట్లు కావాలంటున్నారు ఆయన. తెలుగుదేశం లో టికెట్ దక్కకపోవడంతో నిరాశలో వున్న డాక్టర్ అనసూరి పద్మలత జనసేన టికెట్ హామీ లభించడంతోనే క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ మారినట్లు పసుపు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

భుజాన మోసిన వారు ఏం కావాలి ?

ప్రజారాజ్యంలో పార్టీ స్థాపించిన నాటినుంచి నేటి జనసేన వరకు వున్న సీనియర్ నేతలు పార్టీ అధినేత సర్వేలు చూసి టికెట్లు ఇస్తారని అనుకుంటే ఇలా చేస్తున్నారేమిటన్న అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. ఆయారాం గయారాం లతో పార్టీని నడిపిస్తే మరో సారి దెబ్బతింటామని ఆందోళన చెందుతున్నారు. ఎపి లోని రెండు పార్టీలకు భిన్నంగా సాగుతుందని భావిస్తున్న తమ పార్టీ వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా టికెట్లు కేటాయించడం ఏమిటన్నది ప్రశ్నలు మొదలయ్యాయి. మొత్తానికి టికెట్ల పై అన్ని పార్టీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1662 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*