పవన్ సైలెంట్ కు కారణం…..?

నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్, జనసేన పార్టీ, రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్, నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్, ఏపీ పాలిటిక్స్, nara chandrababu naidu, telugudesam party, y.s.jaganmohan reddy, ysr congress party, pavan kalyan, janasena party, ిrahul gandhi, indian national congress, narendra modi, bharathiya janatha party, andhra pradesh, ap politics

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఎన్నికల అనంతరం మీడియా ముందుకు రాలేదు. ప్రధాన పార్టీల అధినేతలు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ మాత్రం పోలింగ్ అనంతరం ఆయన సైలెంట్ అయ్యారు. ఇందుకు కారణాలు ఏంటి? పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? జరిగిన పోలింగ్ తమ పార్టీకి అనుకూలంగా లేదనా? తన ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఉందనా? ఇదే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.

రెండు పార్టీల నేతలు…..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా ముందుకు వచ్చారు. ఈవీఎంల పనితీరును తప్పుపట్టారు. సైలెంట్ వేవ్ తమకే ఉందని చెప్పారు. మే 23వ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అయితే పోలింగ్ జరిగిన రోజు రాత్రే మీడియా ముందుకు వచ్చారు. తమ పార్టీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తేల్చి చెప్పారు. ప్రజలు తమ వైపే మొగ్గు చూపారన్నారు.

అదే కారణమా?

కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పోలింగ్ అనంతరం మౌనంగా ఉన్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. తాను ఆశించినట్లు కాపు సామాజికవర్గం ఓట్లు తమ ఖాతాలో పడలేదన్నది పవన్ పార్టీ అంచనా. కేవలం 30 ఏళ్ల వయస్సులోపు ఉన్న కాపు యువకులే పవన్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు తప్ప, మిగిలిన కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయన్న అనుమానం ఆయనలో ఉందంటున్నారు. ఇందుకు జిల్లాల నుంచి తాను పార్టీ నేతల నుంచి తెప్పించుకున్న నివేదికలను బట్టి ఆయన ఈ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీకి పడలేదా…?

ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ కల్యాణ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఫ్పాన్ పార్టీవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ కాపుల పట్ల గత నాలుగున్నరేళ్లుగా వ్యవహరించిన తీరు, పవన్ పార్టీ పెద్దగా బలంగా లేకపోవడంతో వారు వైసీపీకి చివరి నిమిషంలో అనుకూలంగా మారారంటున్నారు. అందువల్లనే పవన్ పార్టీకి ఈ జిల్లాల్లోనూ పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదట. ఈ కారణంతోనే పవన్ సైలెంట్ అయిపోయారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.

Ravi Batchali
About Ravi Batchali 37876 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.