గాజువాకలో జెయింట్ కిల్లర్…??

pawankalyan-vs-ysrcongressparty

ఏపీలో ఐదారు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన సాధారణ ఎన్నికల ఘ‌ట్టం ముగిసింది. ఇప్పుడు గెలుపు ఎవరిదనే విషయంలో సహజంగానే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీతో పాటు తొలి సారిగా అదృష్టాన్ని పరిక్షించుకుని, ఏపీ రాజకీయాల్లో తన సత్తా చాటాలని బరిలోకి దిగాడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. గత ఎన్నికలకు ముందే పార్టీ స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ముందు వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చెయ్యలేదు. తొలి సారి ఏపీలో అటు అసెంబ్లీతో పాటు ఇటు లోక్‌సభకు సైతం కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడిగా పవన్‌ తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలోని భీమవరంతో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి బరిలో ఉన్నారు. అటు పవన్‌ అన్నయ్య నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన ఎన్నికల బరిలో ఉండడంతో పాటు అటు మెగా సోదరులు ఇద్దరూ మూడు స్థానాల నుంచి పోటీ చేస్తుండడంతో జనసేన ప్రభావం ఎలా ? ఉంటుంది, మెగా సోదరులు గెలుస్తారా ? అన్న ఆసక్తి అన్ని రాజకీయ పార్టీలతో పాటు సగటు ఓటర్లలోనూ ఉంది.

సానుభూతి అస్త్రాన్ని…..

ఇక విశాఖ జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో పవన్‌కు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తొలి నుంచి ప్రచారం జరిగింది. విశాఖ జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో 3.10 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రచార సరళిలో ముందు నుంచి టీడీపీ వర్సెస్‌ పవన్‌ మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అలాగే భీమవరంలో వైసీపీ వర్సెస్‌ పవన్‌ మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. అయితే గాజువాకలో అనూహ్యంగా వైసీపీ కూడా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ చివరిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి నుంచి కూడా పవన్‌కు గట్టి పోటీనే ఎదురైనట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నాగిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వయస్సు రిత్యా పెద్దవాడు కావడంతో తాను ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఎప్పుడూ గెలవలేననే సానుభూతి అస్త్రాన్ని ప్రధానంగా ప్రచారం చెయ్యడంతో కొద్దో గొప్పో నాగిరెడ్డికి ఈ సెంటిమెంట్‌ వర్కోట్‌ అయినట్టు తెలుస్తోంది.

పవన్‌ పట్టించుకోలేదా…?

ఎన్నికల ప్రచార‌ సరళిని బట్టి చూస్తే పవన్‌ ముందు నుంచి గాజువాకపై ప్రత్యేకంగా దృష్టిసారించి భీమవరంను వదిలేశారన్న టాక్‌ వచ్చింది. అయితే ఎన్నికలకు చివరి మూడు రోజుల పరిణామాలు చూస్తే పవన్‌ అభిమానులు, జనసేన కేడర్‌ గాజువాక కంటే భీమవరం మీదే ప్రత్యేకంగా దృష్టి సారించింది. భీమవరంలో పవన్‌కు సపోర్ట్‌ చేసిన ఓ సామాజికవర్గం భారీ ఎత్తున చందాలు పోగు చేసి మరీ జనసేనకు ఓట్లు వెయ్యాలని ఓటుకు రూ.1000 పంచారు. అదే గాజువాకలో జనసేన కేడర్‌ ఏ మాత్రం పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టినట్టు లేదు. ప్రచార సమయంలోనూ పవన్‌కు గాజువాకలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతో పాటు మైనార్టీ ఓటర్లు, బీసీల్లో కొందరు వైసీపీ వైపు మొగ్గు చూపడం కూడా ఇక్కడ జనసేనకు మైనస్‌గా ఉంది. ఇక గాజువాకలో పవన్‌ తలపెట్టిన బహిరంగ సభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా ఇక్కడ చివరిలో ప్రచారం చేసే అవకాశం లేకపోవడం కూడా పవన్‌ గెలుపుకు అవరోధాలుగా ఉన్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.

భీమవరమే బెటరేమో….

ఇదే సమయంలో గాజువాకలో పోలింగ్‌ జరిగిన తీరును బట్టీ సైతం పవన్‌ గెలుస్తాడని జనసేన కేడర్‌ సైతం ధీమాగా చెప్పలేని పరిస్థితి. పవన్‌ గెలుపుకు భీమవరం కంటే గాజువాకలోనే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని జరిగిన ప్రచారం కాస్త చివరకు భీమవరంలోనే జనసేన పోల్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేసింది. పవన్‌కు గాజువాకకంటే భీమవరంలోనే ఎక్కువ సానుకూలత ఉందన్న స్టేజ్‌కు వచ్చేసింది. ఇక్క‌డ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గంతో పాటు క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గం వ‌న్‌సైడ్‌గా ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేయ‌డం క‌లిసొచ్చింది. మరి పవన్‌ గాజువాక, భీమవరంలో ఎక్కడ ? సత్తా చాటుతాడు, పవన్‌ జాతకాన్ని ఈ రెండు నియోజకవర్గ ఓటర్లు ఎలా ? రాశారన్నది ప్రస్తుతానికి ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2033 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*