బోస్..బాస్ అవుతారా….??

pilli-subhash-chandrabose-mandapet-constiuency

మండపేట నియోజకవర్గంలో గెలుపెవరిది…? ఇక్కడ హేమాహేమీలు పోటీ పడుతున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మండపేట నియోజకవర్గం ఏర్పడింది. 2009, 2014 ఎన్నికల్లో మండపేట నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోయింది. తెలుగుదేశం పార్టీకి మండపేట నియోజకవర్గం దశాబ్దకాలంగా కంచుకోటగా నిలిచిందనే చెప్పాలి. ఈసారి కూడా మండపేటను కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది.

వరుస గెలుపులతో…..

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించింది. వరసగా మండపేట నుంచి రెండుసార్లు గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో పద్దెనిమిది వేలు మెజారిటీ సాధించిన జోగేశ్వరరావు 2014 ఎన్నికల్లో ఏకంగా ముప్ఫయి అయిదు వేల మెజారిటీని సాధించడం విశేషం. గత ఎన్నికల్లో గిరిజాల వెంకటస్వామి నాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది.

పిల్లికి టిక్కెట్ ఇవ్వడంతో…..

సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈసారి మండపేట నుంచి పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీలోనే సీనియర్ నేత. జగన్ పాదయాత్ర సక్సెస్ కావడంతో పాటు తనకున్న సొంత బలంతో ఖచ్చితంగా గెలుస్తానని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు. జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయాలను అడ్డుకుంటానని స్పష్టం చేస్తున్నారు. సర్వేలు కూడా పిల్లికి అనుకూలంగానే రావడంతో టిక్కెట్ ఇచ్చారన్నది పార్టీ వర్గాల్లో విన్పిస్తున్న టాక్.

టీడీపీకే ఎడ్జ్ ఉందా…?

అయితే ఇక్కడ జోగేశ్వరరావు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని చెబుతున్నారు. గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని, మెజారిటీ గతం కంటే ఎక్కువ రావాలన్నదే తన ప్రయత్నమని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు తన పక్షాన ఖచ్చితంగా నిలబడతారని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు. కానీ పిల్లికి ఇక్కడ విజయం కోసం ఎంత శ్రమిస్తున్నా టీడీపీకే కొంత ఎడ్జ్ కన్పిస్తుందంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 26826 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*