పిన్నెల్లికి రా‘బంధు’’వులే…??

pinnelli-ramakrisnareddy-macharla-constiuency

పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో కీ ఫైట్ జరిగింది. ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు దాదాపు సమీప బంధువులే కావడం విశేషం. బంధువుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతోంది. మాచర్ల నియోజకవర్గం తొలుత కాంగ్రెస్ కు తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ కు పెట్టని కోటలా తయారయింది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరసగా మూడు సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పిన్నెల్లి, తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికలో 2012లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే విజయం వరించింది.

అభ్యర్థిని మార్చి….

తెలుగుదేశం పార్టీ ఈసారి అభ్యర్థిని మార్చింది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన చలమారెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నపురెడ్డి అంజిరెడ్డికి టిక్కెట్ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పిన్నెల్లి కేవలం నాలువేల ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించడంతో ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ అభ్యర్థిని మార్చింది. చలమారెడ్డి పిన్నెల్లిని ధీటుగా అన్ని విషయాల్లో ఎదుర్కొన లేరని భావించిన టీడీపీ అధిష్టానం చివరి నిమిషంలో అంజిరెడ్డి పేరును ఖరారు చేసింది.

పారిశ్రామిక వేత్త కావడంతో….

అన్నపురెడ్డి అంజిరెడ్డి ఎవరో కాదు. గత ఎన్నికలలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన చలమారెడ్డికి దగ్గరి బంధువు కావడంతో చివరకు చలమారెడ్డి శాంతించారు. రాయపాటి సాంబశివరావు తనను మోసం చేశారని తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినా బంధువు కావడంతో అంజిరెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడంతో మాచర్లలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర బంధువు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కూడా అంజిరెడ్డికి సపోర్ట్ ఇవ్వడంతో ఈసారి గెలుపు తమదేనన్న ధీమాలో టీడీపీ ఉంది. పిన్నెల్లిని దెబ్బకొట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది.

బలమై క్యాడర్ తో…..

అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత పదేళ్ల నుంచి తనకంటూ నియోజకవర్గంలో ఒక వర్గాన్ని, బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో కూడా ప్రజలతో సత్సంబంధాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ వేవ్ తనను మరోసారి గెలిపిస్తుందన్న విశ్వాసాన్ని పిన్నెల్లి వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా ఇక్కడ ముళ్లా శ్రీనివాస యాదవ్ ఉన్నారు. టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లి బరిలోకి దిగడంతో ఆయన సైకిల్ పార్టీ ఓట్లకు గండి కొడతారని పిన్నెల్లి వర్గం భావిస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బావ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉండటం విశేషం. మొత్తం మీద మాచర్లలో బంధువుల మధ్య వార్ మామూలుగా కనపడటం లేదు. ఈసారి పిన్నెల్లి కొంత చెమటోడ్చక తప్పడం లేదు. మొత్తం మీద పోలింగ్ ముగిసిన తర్వాత మాచర్లలో గెలుపు ఎవరనేది చెప్పడం కష్టంగానే మారింది.

Ravi Batchali
About Ravi Batchali 34189 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*