
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేరుకుని పీకే బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల నుంచి నిర్విరామంగా వైఎస్సార్ పార్టీ కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ను జగన్ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. వారి బృందంతో కాసేపు గడిపారు.
125 స్థానాల్లో….
అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పోలింగ్ జరిగిన తర్వాత తమ బృందం జరిపిన సర్వే నివేదికలను ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో 20 పార్లమెంటు స్థానాలతో పాటు 125 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతున్నట్లు పీకే బృందం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభంజనం బాగా ఉన్నట్లు పీకే బృందం తన సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది.
పవన్ కు సీట్లు ఇవేనా…?
పవన్ గాజువాక, భీమవరం స్థానాల్లో గెలుస్తున్నట్లు ఈ సర్వే నివేదిక సారాంశంగా తెలుస్తోంది. గాజువాక, భీమవరంలతో పాటు మరో నాలుగు స్థానాలను అంటే మొత్తం ఆరు స్థానాలను జనసేన కైవసం చేసుకుంటుందని పీకే బృందం తేల్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వల్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకే ఎక్కువ నష్టం జరిగినట్లు ఈ బృందం గుర్తించింది. తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు దక్కనున్నట్లు పీకే బృందం సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. ఈ నివేదికను పీకే బృందం వైఎస్ జగన్మోహన్
రెడ్డికి ఇచ్చింది.
Leave a Reply