ప్రతిభ ను గుర్తించడం లేదా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఆమెకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కావడం విశేషం. అయినా ఆమె ఏ మాత్రం భయపడకుండా తానేంటో చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే ఆమె ఎవరో మీకర్థమయిపోయి ఉంటుంది. ప్రతిభా భారతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్. ప్రతిభా భారతి ప్రస్తుతం సొంత పార్టీలోనే పరాయి వారుగా మారారు. దీనికి కారణం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నది జగమెరిగిన సత్యమే.

వరుస ఓటములతో…..

కళా వెంకట్రావు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి పోయి తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చినబాబుకు నమ్మకంగా ఉండి రాష్ట్ర పార్టీ అధ్కక్షుడు కాగలిగారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ప్రతిభా భారతి పై కళావెంకట్రావు కక్ష కట్టారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. ప్రతిభా భారతి తెలుగుదేశం పార్టీలోనే ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆమె పార్టీని వీడలేదు. అయితే వరుస ఓటములు ఆమెను రాజకీయంగా కొంత ఇబ్బందులకు గురిచేసిన మాట వాస్తవమే. 2009 ఎన్నికల్లో ప్రతిభాభారతి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళి మీద దాదాపు 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే కష్టపడి నియోజకవర్గంలో తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఆమెకు 2014లో దురదృష్టం వెంటాడింది.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో…..

2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కంభాల జోగులపై ప్రతిభాభారతి కేవలం 512 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రతిభా భారతి ఉవ్విళ్లూరుతున్నారు. వరుస ఓటములతో తనకు సానుభూతి పవనాలు వీస్తాయని ఆమె నమ్ముతున్నారు. కాని సొంత పార్టీ నేతలే ఆమె విజయానికి అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీంతో అధిష్టానం వద్ద అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ప్రతిభా భారతి. ప్రతిభా భారతిని రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు.

కళాతోనే ఇబ్బందులు……

గత నాలుగేళ్లుగా ప్రతిభా భారతి రాజాం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే వైరి పక్షం కావడంతో అంతాతానే అయిత తన ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో కళా వర్గం రంగంలోకి దిగింది. సంక్షేమ పథకాలను మంజూరు చేయడంలో ప్రతిభాభారతి చెప్పిన వారికి కాకుండా తాము చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులపై వత్తిడి తేవడం ప్రారంభించింది. మంత్రి అనుచరులు కావడంతో అధికారులు కూడా వారు చెప్పినట్లే నడుచుకుంటడం, ప్రతిభకు నచ్చలేదు. దీంతో కళాపై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కళా వెంకట్రావు వర్గం సమావేశమై ప్రతిభా భారతిని ఇన్ ఛార్జి పదవి నుంచి తొలగించాలని ఏకంగా ఒక సమావేశం పెట్టి తీర్మానం చేసి మరీ పంపారు. ప్రతిభా భారతి కూడా అధిష్టానానికి కళా పై ఫిర్యాదు చేశారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయి రాజాం నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అధిష్టానం కూడా ఆందోళనలో ఉంది. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 34225 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*