ధూళిపాళ్ల దూల తీర్చింది ఈయనేనట

రావి వెంకటరమణ

సంగం డెయిరీ లో అవకతవకలున్నాయని, అందులో లోగుట్టును అంతా బయటపెట్టింది ఎవరో తెలుసా? అక్కడ వైసీపీ నేత రావి వెంకట రమణ. ఆయన ధూళిపాళ్ల నరేంద్ర పై అనేక ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ జరిగే అవకతవకలను ఎవరి దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం కన్పించలేదు. దీంతో రావి వెంకటరమణ సంగం డెయిరీకి సంబంధించి పకడ్బందీగా ఆధారాలను సేకరించి జగన్ ముందుంచారంటున్నారు. దీనివల్లనే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయగలిగారంటున్నారు.

నమ్మకమైన నేతగా….?

రావి వెంకటరమణ వైసీపీలో నమ్మకమైన నేత. గత ఎన్నికల్లోనే రావి వెంకటరమణ పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని ఈక్వేషన్ల కారణంగా జగన్ కిలారు రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారు. తనను కాదని కిలారు రోశయ్యకు టిక్కెట్ ఇచ్చినా రావి వెంకటరమణ చిత్తశుద్ధితో ఆయన గెలుపుకోసం పనిచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర ను ఓడించడమే థ్యేయంగా పెట్టుకుని విజయం సాధించారు.

అన్ని సాక్ష్యాధారాలతో….

రావి వెంకటరమణ సీనియర్ నేత 2004లోనే ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మాకినేని పెద్దరత్తయ్యను ఓడించారు. అలాంటి వెంకటరమణ వైసీపీ అధికారంలోకి వచ్చినా ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో అక్రమాలను కొనసాగిస్తున్నారని భావించి గత కొద్ది నెలలుగా దీనిపై నిఘా వేశారంటున్నారు. నేరుగా జగన్ తోనే డెయిరీ వ్యవహారం మాట్లాడేందుకు వీలుకలిగింది. దీంతో రావి వెంకటరమణ పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి జగన్ ముందుంచడతో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. జగన్ కూడా రావి వెంకటరమణను ప్రశంసించినట్లు చెబుతున్నారు.

త్వరలోనే కీలక పదవి?

ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కిలారు రోశయ్య ఉన్నప్పటికీ ఆయన నిన్నటి వరకూ ధూళిపాళ్ల నరేంద్ర పై నోరు మెదపలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదన్న ఒప్పందం ఉన్నట్లుంది. ఇది గమనించిన జగన్ రావి వెంకటరమణకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గో ఎహెడ్ అని చెప్పడంతో ఆయన సక్సెస్ ఫుల్ గా టాస్క్ ను పూర్తి చేశారంటున్నారు. 1200 కోట్ల టర్నోవర్ ఉన్న సంగం డెయిరీలో జరుగుతున్న అక్రమాలను సాక్షాధారాలతో సమర్పించడంతో జగన్ త్వరలోనే రావి వెంకటరమణ కు కీలక పదవి ఇవ్వబోతున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 39319 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

25 Comments on ధూళిపాళ్ల దూల తీర్చింది ఈయనేనట

 1. పొన్నూరు,ప్రత్తిపాడు,గుంటూరు…..మూడు నియోజకవర్గాలలో పట్టున్న నాయకుడు రావి వెంకటరమణ.

 2. *జగన్ అన్న సంక్షేమ పాలనలో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తుంటే,మన పెదకాకాని గ్రామానికి ఏమైంది?*

  గత అసెంబ్లీ ఎన్నికలలో వైసిపికి ఇక్కడ 240ఓట్లు మెజారీటీ వస్తే,గ్రామ పంచాయతి ఎన్నికలలో 1048ఓట్లు మైనస్ అయింది.

  మనపార్టీ ఆవిర్భవించిన కొత్తలోనే, 2013 గ్రామ పంచాయతి ఎన్నికలలో ఆళ్ళ వీరరాఘవమ్మగారు రికార్డు మెజారిటీతో గెలిచి , ఇక్కడ వైసిపి జెండాని రెపరెపలాడిచారు.

  ఈరోజు మనపార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ టిడిపి గెలవడానికి గల కారణాలు ఏంటి?,అందులోను 1048 ఓట్లు మెజారీటీ.

  *ఇది ఎవరి లోపం అన్న?*

 3. *పొన్నూరు నియోజకవర్గంలో వైసిపికి గుండెకాయ లాంటిది నంబూరు గ్రామము*

  *2019 అసెంబ్లీ ఎన్నికలలో* మన వైసిపికి 4,205ఓట్లు భారీ మెజారీటిని అందించి,మన వైసిపి గెలుపులో సింహాభాగం అయింది ఈ గ్రామము.స్థానిక గ్రామ వైసిపి నాయకులందరు కలిసి,చందాలు వేసుకుని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి,పనిచేయబట్టే గత అసెంబ్లీ ఎన్నికలలో అంతా మెజారీటిని సాధించగలిగారు.అదే *2014అసెంబ్లీ ఎన్నికలలో* మన వైసిపికి ఇక్కడ ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల1867ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చింది.

  ఒకప్పుడు గ్రూపులుగా ఉన్న ఇక్కడి నాయకులందరిని ఒకతాటి మీదకు తీసుకురావడానికి అప్పటి నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణగారు ఎంతో శ్రమించారు.రావి వెంకటరమణగారి తొమ్మిదేళ్ళ కష్ట ఫలితమే ఈ గెలుపు.

  చిత్రం ఏమిటంటే 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటరమణగారేమో ఎవరిని నిందించకుండా,లోపాలు సరిదిద్దుకుని,అందరిని కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.

  2019 ఎన్నికలలో కష్టం తెలియకుండా చివరి నిముషంలో సీటు తెచ్చుకున్న నాయకుడేమో ఒకపక్క గెలిచి కూడా,పదవి-హోదా అనుభవిస్తూ, పనిచేసిన పార్టీ క్యాడర్ పై నిందలు వేస్తూ,వారిని పార్టీకి దూరం పెట్టి,ఏకతాటి మీద ఉన్న పార్టీని గ్రూపులు చేసి,ముక్కలు చేస్తున్నాడు.

  *వైసిపి అసెంబ్లీ ఫలితాలు:*
  2014 -1,867 ఓట్లు మెజారిటీ
  2019 -4,205 ఓట్లు మెజారిటీ

  *పంచాయతీ ఎన్నికల ఫలితాలు:*
  వైసిపి – ఓటమి
  వైసిపి రెబల్- 2,349 ఓట్లు మెజారిటీ

  గ్రామస్థాయిలో బలమైన నాయకులని గుర్తించి,వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి,సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం సొంతపార్టీ నాయకుడి లక్షణం.

  అంతేగాని వైసిపి కంచుకోటలుగా పేరున్న గ్రామాలలో స్థానిక నాయకత్వాన్ని దెబ్బతీయడం కోసం గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ పార్టీకి నష్టం చేసేవారి గురించి ఏం అనుకోవాలి?
  *పత్యర్ధిపార్టీగా భావించాలా?లేక ఆ పత్యర్ధి పార్టీతో లోపాయకారిగా చేతులు కలిపి ఉంటారని అనుకోవాలా?*

 4. *వైసిపి కంచుకోటలుగా ఉన్న గ్రామాలని దెబ్బతీసి వెళ్ళడమే రోశయ్య లక్ష్యం.*

 5. పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాలలో టిడిపి నాయకుల గుప్పెట్లో ఉన్న కేబుల్ నెట్ వర్క్ ని మన నాయకులు విడిపించడం జరిగింది.మన దురదృష్టం ఏంటోగాని ఇప్పటికి మన నియోజకవర్గంలో టిడిపి నాయకుల పెత్తనమే కొనసాగుతుంది.వైసిపి నాయకుల పనులైన పెండింగ్ పడుతున్నాయి గాని టిడిపి నాయకుల పనులు మాత్రం అన్ని డిపార్టుమెంట్ లలో చకచక జరిగిపోతున్నాయి.ఇది మన చేతగానితనమో లేక చేతులు మారుతున్నాయో తెలియదు గాని వైసిపి కార్యకర్తలకు మాత్రం ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది.మనం మౌనంగా ఉన్నంతకాలం ఇలాంటివాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి.ఇకనైన ఆలోచించండి అన్యాయాలపై
  పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప.

  జగన్ అన్న రచ్చబండ కార్యక్రమములో కేబుల్ విషయం కూడా కంప్లైంట్ చేద్దాం.లోపం ఎక్కడ ఉందో తెలుసుకోడానికి జగన్ అన్నకి నిముషం పట్టదు.

 6. *గత టిడిపి ప్రభుత్వంలో ధూళిపాళ్ళ నరేంద్ర చేసిన గ్రావెల్ అక్రమాలపై,ఏకంగా మన జగనన్నే వచ్చి ధర్నా చేసిన ప్రాంతం అది.*
  మీ అవినీతి,అక్రమాల వల్ల మనపార్టీకి,మన జగనన్నకి చెడ్డపేరు తీసుకురాకండి.ఇక్కడ ఉన్న *ధూళిపాళ్ళ నరేంద్ర ఏ కారణాల వలనో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న,* అక్కడ ఉన్న ఎల్లో మీడియా మాత్రం అందరికి తెలిసేలా ప్రసారం చేస్తూ,ఆ మచ్చ మన ప్రభుత్వానికి అందిస్తుంది. జర జాగ్రత్త!

  *ధూళిపాళ్ళ నరేంద్రకి జగన్మోహనరెడ్డిగారు, అమరావతి మాత్రమే కనిపిస్తాయి విమర్శించడానికి* .
  తన సొంత నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్నా విమర్శించరు.ఇటీవల పట్టుపడిన డ్రగ్స్ కేసులో పొన్నూరులో కొంతమంది వైసిపి నాయకుల పాత్ర ఉన్నట్టు వార్తా పత్రికలో వచ్చిన విమర్శించరు. ఆయనకి మా జగన్ అన్న మాత్రమే కనిపిస్తారు.

  వాళ్ళ నాయకుడు,ఆయన వ్యాపారాలను కాపాడుకోవడం కోసం ఎంతకి దిగజారిపోయాడో, ఈ పొన్నూరు నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు కూడా ఇకనైనా తెలుసుకుని,ధూళిపాళ్ళ మీద నమ్మకం వదిలేసి, రాజకీయాలు ప్రక్కన పెట్టి, ఎవరి పని వారు చేసుకోవడం మంచిది.

 7. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు బీసీ సెల్ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు, వారి పిల్లల మీద మాజీ ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టి, వారి కుమారుడు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న ఆశలన్నీ ఆవిరి చేశాడు, అయినా కానీ రావి గారు ఇచ్చిన ధైర్యంతో, ఆయన మీద ఉన్న భరోసాతో బ్రహ్మయ్య గారు భయపడకుండా కేసులు ఎదుర్కొంటున్నాడు,
  నవరత్నాలు ప్రోగ్రాం కి, గడప గడప ప్రోగ్రాలు కి, డబ్బులు ఖర్చు చేసి, పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశాడు, ఇలాగ చాలా మంచి నాయకులు పార్టీ కి డబ్బులు ఖర్చు పెట్టి, ఆస్తులు అమ్ముకుని, పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు, ఇప్పుడు కొంతమంది స్వార్థ నాయకులు, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు, అధిష్టానం మీరు పొన్నూరు నియోజకవర్గం లో జరుగుతున్న డ్యామేజ్ ని తెలుసుకో లేకపోతే మళ్ళీ ఇక్కడ ధూళిపాళ్ల రౌడీ రాజ్యం మళ్లీ వస్తుంది,
  మేము ఒకటి అనుకుంటాం, విత్తనం నాటడం, మొక్కకు నీరుపోసి పెద్దది చేశాం, దానికి కాయలు వచ్చి, ఆ చెట్టు పెద్దది పదిమందికి నీడనిచ్చే లాగా ఈ తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాం, ఆ చెట్టు కాయలు మేము తినకపోయినా, ఆ చెట్టు నీడలో మేము ఉండకపోయినా,ఆ చెట్టు వల్ల పదిమందికి సాయం పొందుతున్నారు అంటే, దానికి కారణం మేము అని గర్వంగా చెప్పుకుంటున్నాము, కానీ ఇప్పుడు కొంతమంది స్వార్థ నాయకులు, మేము పెంచిన చెట్టు కొమ్మల్ని ఒకటొకటిగా నరుకుతూ ఉంటే దాన్ని కష్టపడి పెంచిన మాకు బాధ అనిపిస్తుంది,
  మేము పడిన కష్టానికి వచ్చే ఉగాది, మన అందరికీ తీపి కబురు వస్తుందని ఆశిస్తున్నాను,
  ఉగాది పచ్చడి లో ఉన్న రుచులు మొత్తం చూశాం, మిగిలిన ఒక తీపి రుచి త్వరలో చూడబోతున్నాం,
  మీ
  సయ్యద్ జాఫర్
  జై జగన్❤️ జై రావి❤️

 8. *కొప్పరావూరులో వైసిపి పార్టీ అంటే ,ఒక డ్రామా కంపెనీలా ఉందే..*

  నిన్నటి దాకా టిడిపి కండువా మెడలో వేసుకుని తిరిగిన నాయకులు,ప్రస్తుతం వారి అవసరాల కోసం వైసిపి కండువాలు కప్పుకున్నారు. ప్రస్తుతం వైసిపిలోకి వచ్చి పెత్తనం చేస్తున్న ఈ డ్రామా కంపెని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి, మరల టిడిపి జండాలు పట్టుకుని తిరుగుతుంది.

  *కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈగ్రామం,మొదటినుండి టిడిపికి కంచుకోట.*

  మనపార్టీ ఆవిర్భవించిన కొత్తలో, ………..
  ఈ గ్రామంలో మన వైసిపికి నాయకులే లేని రోజుల్లో, ……………………..
  మన జగనన్న నాయకత్వంలో పనిచేయడానికి,
  ఈ గ్రామంలో యువకులు ముందుకు వచ్చి, *జీరో స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి,మంచి పునాది వేశారు.*

  కొత్తగా వచ్చిన ఈ కమర్షియల్ లీడర్,ఆ టిడిపి కంచుకోటని గాజుగ్లాసులా జాగ్రత్తగా కాపాడటానికి,ఇక్కడ వైసిపికి పునాది వేసిన కార్యకర్తలందరిని పూర్తిగా దూరం పెట్టి, వైసిపి పెత్తనమంత ఈ డ్రామా కంపెనీకి అప్పగించాడు. ఎంపిటిసి అభ్యర్ధిగా కూడా టిడిపి నుండి వచ్చిన ఆ డమ్మీనే నిలబెట్టడం జరిగింది.

  2014 అసెంబ్లీ ఎన్నికలలో *టిడిపికి 805 ఓట్లు మెజారిటీ* వస్తే,

  2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి *టిడిపి మెజారిటి 774 ఓట్ల* కు పడిపోయింది.

  పంచాయతి ఎన్నికలలో మన అధికారపార్టీ ధాటికి గల్లంతు కావాల్సిన *టిడిపి* ,ఈ డ్రామా కంపెనీ వల్ల అనూహ్యంగా *పుంజుకుని 1183 ఓట్ల మెజారిటీనిసాధించింది.*

  *ఒక్కసారి అధిష్టానం పెద్దలు, రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న కొప్పరావూరు గ్రామాన్ని గమనిస్తే తెలుస్తుంది,పొన్నూరు నియోజకవర్గంలో మన వైసిపి పరిస్థితి ఎలా వుందో చెప్పడానికి.*

 9. *రావి వర్గం పనిచేయడం వల్లే “రోశయ్యగారు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు” అనే దానికి ఈ ఒక్క ఆధారం సరిపోదా?*

  ఒక్క మా పెదకాకాని మండలమే తీసుకుంటే…

  *2014 అసెంబ్లీ ఎన్నికలలో* రావి వెంకటరమణగారు పోటీ చేసినప్పుడు ఈ మండలంలో *టిడిపికి 2,496 ఓట్లు మెజారీటీ* వచ్చింది.ఆ ఎన్నికలలో రావి వెంకటరమణగారు ఓడిపోయినప్పుడు ఎవరిని నిందించలేదు. లోపాలు ఎక్కడ ఉన్నాయో సరిచేసుకున్నాడు, గ్రూపు రాజకీయాలతో నలిగిపోతున్న పార్టీని ఏకం చేసి, అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. అందుకోసం గడప గడపకు తిరిగాడు, ప్రతి కుటుంబాన్ని పలకరించి, జగన్ అన్న ఆశయాలని-హామీలని వివరించి, ప్రతి కుటుంబం వైసిపి వైపు ఆకర్షితులయ్యేలా కృషి చేశాడు.

  రాష్ట్రమంతా జగనన్న వైసిపి విత్తనాలు చల్లితే, పొన్నూరు నియోజకవర్గంలో ఆ విత్తనం మొలకెత్తిన దగ్గర నుండి, మానుగా ఎదగడానికి రావి వెంకటరమణగారు చేసిన కృషి,పడిన కష్టం అందరికి తెలుసు.ఆయన కష్ట ఫలితమే *2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపికి వచ్చిన 1,231 ఓట్ల మెజారిటీ.* ఈ మండలంలో 2496 ఓట్లు మైనస్ లో ఉన్న పార్టీని, 1231 ఓట్లు మెజారిటీకి తెచ్చిన ఘనత రావి వెంకటరమణగారికే దక్కుతుంది. ఈ తొమ్మిదేళ్ళు పార్టీ గెలుపు కోసం రావి వెంకటరమణగారు ఎంత కృషి చేశారో, కేవలం 23రోజుల ముందు వచ్చిన మీకు తెలియక పోవచ్చు. ఆయన కష్టాన్ని దగ్గర ఉండి చూసిన ప్రతి కార్యకర్తకి తెలుసు.

  *ప్రస్తుతం మీ నాయకత్వంలో జరిగిన పంచాయతి ఎన్నికలలో ఈ మండలంలో మనపార్టీకి ఎంత మెజారిటీ తీసుకువచ్చారో ఒకసారి పరిశీలిద్దాం* …..

  మీ నాయకత్వంలో గెలిచిన ఆ 5 పంచాయితీల మీద,మన వైసిపికి వచ్చిన మెజారిటీ – 200 ఓట్లు

  టిడిపి గెలిచిన 6 పంచాయతీల మీద,ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ – 4,673 ఓట్లు

  *అంటే మీ నాయకత్వంలో టిడిపికి 4473 ఓట్లు మెజారిటీ వచ్చింది,అది కూడా మనపార్టీ అధికారంలో ఉన్నప్పుడు.*
  …………………………………….
  ఇక నంబూరు గ్రామ పంచాయతీని గెలిచిన వైసిపి రెబల్ కి వచ్చిన మెజారిటీ – 2,348 ఓట్లు
  (మీ దృష్టిలో రావి వర్గం సాధించిన మెజారిటీ)

  పార్టీలో ఈ గ్రూపులని పక్కన పెడితే మన వైసిపి మీద టిడిపికి 2,125 ఓట్లు మెజారిటీ వచ్చింది.

  అంటే ఈ గ్రూపుల వల్ల మన పార్టీ మరల తొమ్మిదేళ్ళు వెనక్కి వెళ్ళింది.దయచేసి ఈ గ్రూపులని పక్కన పెట్టి పార్టీని బతికించండి.ఐదు వేళ్ళు కలిస్తేనే పిడికిలి అవుతుంది. *గ్రూపులుగా వేరుచేస్తే నష్టపోయేది మనపార్టీనే, ఆలోచించండి.*
  …………………………………….

 10. రావి వర్గం బూత్ కన్వీనర్లుగా, ఏజెంటుగా, ఉన్న బూత్ లో మెజార్టీ ఎంత వచ్చింది, ఇప్పుడు భజన చేస్తున్నా, నాయకుల బూత్ లో మెజార్టీ ఎంత వచ్చింది చూసుకో మనండి, అదే రావి వర్గం కనుక బూత్ ఏజెంట్లుగా కూర్చోకపోతే టిడిపి రిగ్గింగ్ చేసుకుని గెలిచేది, రావి వెంకటమణ గారు పార్టీ మనది, మన శత్రువు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఓడిపోవాలి, ఎలక్షన్ల ముందు సమావేశం పరిచి మా అందరికీ కష్టపడి పార్టీ ని గెలిపించండి అని అన్నారు,
  మా అన్న ఆదేశాల మేరకు, ఎటువంటి డబ్బుకి ముందుకి ఆశపడకుండా, మాకు అప్పజెప్పిన బాధ్యతలను, నిజాయితీగా పనిచేసి, మా బూత్ లో మెజార్టీ తీసుకొచ్చాం
  మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీరు అనుకుంటున్నా రావి వర్గం బూత్ నంబర్లు మీ దగ్గర ఉన్నాయిగా, చెక్ చేసుకోండి,
  నిజాయితీగా ఉన్నాడు, ఎవరికీ భయపడడు, ఎందుకంటే అమ్ముడు పోయే రాజకీయాలు, మాకు మా అమ్మ నాన్న నేర్ప లేదు, మా నాయకుడు నేర్పలేదు, మీకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా, రావి వర్గం ఏ బూత్ కన్వీనర్ అయినా ఫోన్ చేసి మీ బూత్ వివరాలు చెప్పమంటే నిద్ర నుంచి లేపిన చెప్పాం, ఎందుకంటే మా నాయకుడు మా చేత పని అలా చేయించాడు, ఇప్పుడున్న నాయకులు కనీసం వాళ్లు ఏ బూత్ లో ఓటేశారు చెప్పమనండి చాలు,
  నేను రాజకీయాలు వదిలేస్తాను

 11. *నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెదకాకాని మండలంలో పది పంచాయతీల దాకా గెలిచాం*

  మరి నేడు అధికారంలో ఉండి కూడా ఏమైంది మనపార్టీకి?

  *కేవలం 5 పంచాయతిలా గెలిచేది*

 12. *రోశయ్యే అనుకుంటే, ఆయన PA అతని తాతలా ఉన్నాడే.*

  కనీసం ఫోన్లు కూడా ఎత్తడు.సరిగా సమాధానం కూడా చెప్పడు.

  ఆయనకి ఎంతమంది PAలు మారినా, వచ్చేది మరల ఆయన సామాజికవర్గంవారేనా!,అక్కడ మాత్రం ఎలాంటి మార్పు ఉండదా!.

  *ఆయనకి PA లుగా సొంత సామాజికవర్గం వారు తప్ప, వేరేవారు పనికి రారా!, లేక వేరే సామాజిక వర్గం వారిపై నమ్మకం లేదా!*

 13. *పొన్నూరు నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తూ,అక్రమకేసులు పెడుతున్నారు.ఎవరి ప్రోద్భలంలో ఇవన్ని జరుగుతున్నాయి.*

  పొన్నూరు నియోజకవర్గంలో అసలు ఏ పార్టీ అధికారంలో ఉందో అర్ధం కావడంలేదు.

  ఇప్పటికైన నాయకులు స్పందించకుంటే,వైసిపి జెండాలు పట్టుకుని ధర్నాలు చేయాల్సి ఉంటుంది.

 14. అప్పులపాలై,అవమానపాలై బ్రతకడం దేనికి….ఆలోచించండి.

  పొన్నూరు నియోజకవర్గంలో చాలామంది వైసిపి నాయకులు,వారికి రావాల్సిన బిల్లుల కోసం మౌనంగా ఉంటున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు గొంతెత్తి మాట్లాడితే, మీకు రావాలసిన బిల్లులు ఆపడం ఇక్కడ ఎవరితరం కాదు. ఎవరికి పర్సంటేజీలు, లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొమ్మిదేళ్ళు పార్టీకి పనిచేసిన నాయకుడిగా గట్టిగా అడిగే హక్కు నీకు ఉంది. నువ్వు మౌనంగా భరించినంత వరకు, నువ్వు బానిసగా బ్రతికినంత వరకు, నువ్వు చేతకానివాడిలా ఉన్నంత వరకు,నీకు బిల్లులు రావు.

  బిల్లులు రావలసిన వైసిపి నాయకులు ఎదురుచూస్తూ కూర్చుంటే, ఆర్ధికంగా నష్టపోయేది మీరే, అప్పులపాలయ్యేది మీరే. కనుక ఈ మీటింగ్ ని విజయవంతం చేయాల్సిన అవసరం మరి ముఖ్యంగా మీకే వుంది ఆలోచించుకోండి.

 15. వై యెస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం…..
  అన్న…
  పొన్నూరు నియోజకవర్గంలో మన పార్టీ ఏ పరిస్థితిలో ఉంది
  10 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది.
  మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఒక భరోసా ఉంది..ఆ భరోసా గౌరవనీయులు శ్రీ రావి వెంకటరమణ గారు…
  పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ప్రజలలోకి తీసుకుపోయే కార్యకర్తలు అమైయ్యారు..
  .సర్ మేము 10 సంవత్సరల నుంచి పార్టీకి కష్టపడ్డాం అంటే నాకు ఈ పని కావాలి అంటే…
  చూద్దాం
  సర్ మనోడే జనసేన నుంచి వచ్చాడు ఉద్యోగం కావాలి అంటే
  మనోడే కదా వాలంటర్ ఉద్యోగం తీసుకో
  సర్ మనోడే టీడీపీ నుంచి వచ్చారు
  కాంట్రాక్టు బిల్ పెండింగ్ వెంటనే సంతకం పెడతారు..
  పార్టీ కి చెడ్డ పేరు తెస్తూ ఆ నిందని ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు అంటారు. మారండి లేకపోతే తటతెస్తా అంటారు.చేసేది మొత్తం మీరు.
  టీడీపీ జనసేన కోవర్తుల ముందు 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డా కార్యకర్తలను నాయకులను తిడతారు వారు మీరు చేసే ఘనీకార్యానికి వారు తప్పట్లు కొడతారు. ఇదేనా మీరు పార్టీకి పార్టీ కార్యకర్తలకు చేసే సేవ.
  పార్టీ కోసం మీరు ఏ రోజు కడ్తపడ్డారు. పార్టీ కోసం మీరు ఎం చేశారు. పార్టీలో మీ గొప్పతనం ఏంది. మీరు ఏమి చెప్పలేరు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడిన వారి కష్టం మీద గెలిచారు…
  జగన్ గారి ఓదార్పు యాత్రలో మీరు ఉన్నారా
  సమైక్యాంధ్ర ఉద్యమంలో మీరు పాల్గొన్నారా
  జగన్ గారు మొదటిసారి గడప గడపీకి వై యెస్ ఆర్ లో మీరు ఉన్నారా
  ఇంటి ఇంటికి నవరత్నాలు లో మీరు ఉన్నారా
  రెండవసారి గడప గడప ప్రోగ్రాం లో మీరు ఉన్నారా
  బూత్ వారి కమిటీ వర్క్ మీరు చెపిచ్చారా.
  పల్లె నిద్రలు చేసారా
  ధర్నాలు చేసారా రాస్తారోకో లు చేసారా.
  మీరు ఏమి చేశారు పార్టీ కోసం
  ప్రతి కార్యకర్త కు అడగండి మీరు ఏమి చేశారు అని
  మేము చెప్తాం గర్వంగా పైన పార్టీ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్ గురించి నవరత్నాలు గురించి
  జగన్ గారిని సీఎం చేయటానికి రావి వెంకటరమణ గారి కృషి గురించి.
  అన్న మనమందరం కలిసి పార్టీని కాపాడుకోవాలి లేకపోతే పొన్నూరు నియోజకవర్గంలో మన కష్టం వృధా అవుతుంది. మరల ధూళిపాళ్ల అరాచక పాలన వస్తుంది.మనం అంత ఏకమై కలిసి కట్టుగా పాయనిద్దాం….
  జై జగన్ జైజై జగన్
  జిందాబాద్ వై యెస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
  Vote for fan

 16. పొన్నూరు నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడిన వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలకు, నాయకులకు, పిలుపు. గత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైయస్సార్సీపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, జగన్మోహన్ రెడ్డి గారినీ సీఎంగా చూడాలని ధ్యేయంతో ధైర్యంతో పట్టువీడని వీర సైనికుడు గా పోరాడిన కార్యకర్తలారా మళ్లీ మనం అందరం ఒక్కటి అవ్వాల్సిన సమయం ఆసన్నమైనది. దీనికోసం ఎక్కడికైనా రెడీ ఎందాకైనా రెడీ.

  పొన్నూరు పట్టణ బీసీ సెల్ , k.బ్రహ్మయ్య.
  జై జగన్ జై రావి

 17. గత పొన్నూరు రాజకీయాలు ఒక్కసారి పరిశీలిస్తే …….

  నాటి కాంగ్రెస్ పార్టీలో దళితులు,ముస్లింలు కలసి పోరాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు.అందుకే 5 పర్యాయాలు ధూళిపాళ్ళ నరేంద్ర విజయం సాధించగలిగారు. కాని మన వైసిపి ఆవిర్భవించిన దగ్గర నుండి దళితులు,ముస్లింలు ఏకమై ఉద్యమాలు చేసి, పోరాడబట్టే ఈరోజు పొన్నూరులో టిడిపి ఓడిపోవడం జరిగింది.

  ప్రస్తుతం పొన్నూరు వైసిపిలో జరుగుతున్న విషయాలను లోతుగా పరిశీలిస్తే…

  ఏ దళిత,ముస్లిం కార్యకర్తలైతే పార్టీ గెలుపుకి ముఖ్యంగా కష్టపడ్డారో, ఆ వర్గాలని పార్టీకి దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. వైసిపిలో నాయకత్వం వహించే దళిత, ముస్లిం నాయకులని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. మన పార్టీలో ఉన్న దళితులని, ముస్లింలను చిన్నచూపు చూస్తూ, అసభ్యపదజాలంతో ధూషిస్తూ, అవమానిస్తున్నారు. బలమైన లీడర్ షిప్ ఉన్న గ్రామాలలో కూడా రెడ్డి సామాజికవర్గ నాయకులని దెబ్బతీయాలని ఆలోచన ఉన్న, వారితో డైరెక్టుగా పెట్టుకునే సాహసం రోశయ్యకి లేదు. మొన్న నంబూరు గ్రామంలో ప్రయత్నించి, విఫలమై చివరికి కాళ్ళబేరానికి వెళ్ళాడు. కనుక అటు ఆర్ధికంగా, సామాజికంగా తక్కువగా కనిపిస్తున్న దళిత, ముస్లిం నాయకులనే ఆయన టార్గెట్ గా ఎంచుకున్నాడు.

  “నేను ఈరోజు ఉండొచ్చు,రేపు పోవచ్చు” అని రోశయ్య ఉపన్యాసాలలో చెపుతూ ఉండటం మీరు గమనించే ఉంటారు.రేపు వెళ్ళే ఆలోచన ఉన్నప్పుడు, ఇదంతా ఎవరికీ లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్నాడో, ఈ వర్గాలని ఎందుకు పార్టీకి దూరం చేస్తున్నాడో,ఆ లోపాయకారి ఒప్పందాలు ఏమిటో దీర్ఘంగా ఆలోచిచే ప్రతి ఒక్కరికి తెలియంది కాదు.

 18. అతిసామాన్య చిన్న నాయకుని దాచుకుందామన్న దాచుకోలేని ఆవేదన …రమణ గారంటే ఒకనమ్మకం ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ మానమున్న రంగంలో ఎంతవరకు కమిట్మెంట్ తో వున్నాము పార్టీ కి గాని పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరమున్న పార్టీ అధికారంలో వున్నా లేకున్నా మీకు అండగా నేనున్నాను అని భుజంతట్టి ఒక అన్నలా ఒక శ్రేయోభిలాషిలా అన్ని తానై ఒక భరోసా కల్పించే అతికొద్దిమంది నాయకులలో విలువలతో కూడుకున్న వ్యక్తిత్వం రమణ గారి సొంతం. ఏ కార్యకర్త ఫోన్ చేసిన స్పందించి సహకరించే వారి తీరు అది వారికే చెల్లు ఎవడు అవునన్నా కాదన్నా ఆయన ప్రజలమనసు కార్యకర్తల మనసుదోచుకున్న నాయకుడు అలంటి నాయకులకు ఓటమి అనేదే ఉండదు (హీ ఈజ్ ద లెజండ్రీ పర్సన్)

 19. పొన్నూరు నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలు దాచుకుందామన్న దాచుకోలేని ఆవేదన …రావి వెంకటరమణగారంటే ఒకనమ్మకం. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరమున్న పార్టీ అధికారంలో వున్నా లేకున్నా మీకు అండగా నేనున్నాను అని భుజంతట్టి ఒక అన్నలా,ఒక శ్రేయోభిలాషిలా అన్ని తానై ఒక భరోసా కల్పించే అతికొద్దిమంది నాయకులలో విలువలతో కూడుకున్న వ్యక్తిత్వం రమణ గారి సొంతం. ఏ కార్యకర్త ఫోన్ చేసిన స్పందించి సహకరించే వారి తీరు అది వారికే చెల్లు. ఎవడు అవునన్నా కాదన్నా ఆయన ప్రజల మనసుదోచుకున్న నాయకుడు అలాంటి నాయకులకు ఓటమి అనేదే ఉండదు (హీ ఈజ్ ద లెజండ్రీ పర్సన్)

 20. వైసిపి ఎమ్మెల్యే రికమండేషన్ తో జనసేన కార్యకర్తకి ఉద్యోగం….

  పొన్నూరు మండలంలోని తహశీల్దార్ వారి కార్యాలయంలో జనసేన కార్యకర్త ,వైసిపి లీడర్ రికమండేషన్ తో గత ఆరు నెలలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు.

  కులం పేరుతో ఆ వైసిపి ఎమ్మెల్యేకి దగ్గరైన ఈ జనసేన కార్యకర్త , ఆ వైసిపి లీడర్ పేరు వాడుకుంటూ,తన కులం పేరు చెప్పుకుంటూ, ఇప్పుడు పొన్నూరు తాహశీల్దార్ కార్యాలయంలో అధికారులందరిని హడలెత్తిస్తున్నాడు.

  జనసేన కార్యకర్తలకు,తన సామాజిక వర్గం వారికి మాత్రమే తహశీల్దార్ కార్యాలయంలో ఏ పనులైన చేసిపెడుతున్న ఈ జనసేన కార్యకర్త దెబ్బకి, ముఖ్య అధికారులు కూడా ఏం చేయలేక బదిలీ అవుతున్నారని సమాచారం.

  ఇప్పటికే పొన్నూరు తాహశీల్దారువారి కార్యాలయంలో జనసేన సానుభూతిపరుడైన ఓ అధికారి RI గా విధులు నిర్వహిస్తున్నాడు.అతను సోషల్ మీడియాలో జగనన్నపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా వున్నవి.

  అసలు ఈ వైసిపి ఎమ్మెల్యే జనసేన అభిమానులని, టిడిపి సానుభూతిపరులను అందులోను మరిముఖ్యంగా తన సామాజికవర్గంవారిని మాత్రమే ఏరికోరి తీసుకొచ్చి అన్ని డిపార్టుమెంటులలో పెడుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఇదే ఆఫీసులో దళిత సామాజికవర్గానికి చెందిన ఆరుగురు విర్వోలను ఒకేసారి బదిలీ చేసిన సందర్భాలు ఉన్నవి.ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న *తాహశీల్దారుగారు సెలవు పెట్టి వెళ్ళిపోవడానికి ఏవో కారణాలు వినిపిస్తున్నాయి.

  ఈ ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు పదవుల కోసం,పనుల కోసం వైసిపిలోకి వచ్చిన,వారి అభిమానం అంతా ఆ జనసేన మీదనే ఉన్నట్టుగా ఉంది. కులం మీద అభిమానం ఉంటే వైసిపిలో ఉన్న నీ సామాజికవర్గం వారికి పనులు చేసుకో,అంతేగాని జనసేన,టిడిపిలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వడం దేనికో.

Leave a Reply

Your email address will not be published.


*