చివరకు బలయిపోవాల్సిందేనా?

రఘురామ కృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పుడు బీజేపీ కూడా విరోధిగా మారుతుంది. ఆయన అనుకున్న ప్రయత్నం వికటించిందంటున్నారు. రఘురామ కృష్ణంరాజు నిజానికి బీజేపీకి దగ్గరవ్వాలనే వైసీపీకి దూరమయ్యారు. బీజేపీలో చేరితే తనకు ఇబ్బంది ఉండదని భావించారు. అందుకే ఆయన ఎంపీగా గెలిచిన నాటి నుంచి బీజేపీ నేతలను తరచూ కలుస్తూ లాబీయింగ్ చేస్తూ వచ్చారు. అనర్హత వేటు తనపై పడదన్న గట్టి నమ్మకంతో రఘురామ కృష్ణంరాజు ఉన్నారు.

గ్యాప్ పెరుగుతోంది…..

కానీ రోజురోజుకూ బీజేపీకి, రఘురామకృష్ణంరాజుకు మధ్య గ్యాప్ పెరిగిపోతున్నట్లు కన్పిస్తుంది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతల అభిప్రాయాలను తోసిపుచ్చారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యాలను ఆయన తప్పు పట్టారు. రాజధాని విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటుందని పదే పదే రోజూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెబుతున్నారు.

సుజనా బాధ్యతలను….

గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బాధ్యతను రఘురామ కృష్ణంరాజు తీసుకున్నట్లు కనపడుతుంది. అయితే ఇది బీజేపీ రాష్ట్ర నేతలకు ఇబ్బందికరంగా మారింది. రఘురామ కృష్ణంరాజు మీద బీజేపీ రాష్ట్ర నేతలు ఎటాక్ ప్రారంభించారు. బీజేపీకి లోక్ సభ సభ్యుల మద్దతు అవసరం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి దగ్గరకావాలనుకున్న రాజుగారు ఆ పార్టీ నేతలతోనే కయ్యానికి దిగడంతో ఆ దారి కూడా మూసుకుపోయినట్లేనంటున్నారు.

బాబు చేతిలో టూల్ అంటూ….

మరోవైపు రఘురామ కృష్ణంరాజు నిత్యం చేస్తున్న విమర్శలకు విలువ లేకుండా చేయడానికి వైసీపీ కూడా రంగంలోకి దిగింది. చంద్రబాబు చేతిలో రఘురామ కృష‌్ణంరాజు టూల్ గా మారారని విమర్శలు సంధిస్తున్నారు. రఘురామ కృష‌్ణంరాజు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో కయ్యానికి దిగి ఏం సాధించాలనుకుంటున్నారని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఇబ్బంది కరంగా ఉన్న టీడీపీకి చేరువై చేసేదేముందన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30230 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*