త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనా?

కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రతి ప్రాంతీయ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. కొద్దిపాటి బలమున్న చోట కూడా కాంగ్రెస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ కాదు. మహాకూటమి పేరుతో ఎన్నికలకు వెళదామనుకుంటున్న పార్టీలే అడుగడుగునా కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే.

మాయావతి ఝలక్ తోనే……

ీఇప్పటికే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో దాదాపు 22 మంది అభ్యర్థుల జాబితాను మాయా విడుదల చేశారు. ఛత్తీస్ ఘడ్ లో అజిత్ జోగి పార్టీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొంత పునరాలోచనలో పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో మాయావతి కాంగ్రెస్ పార్టీకి మాయావతి అవసరం ఉంది. అయితే మాయావతి చేసిన అలవికాని డిమాండ్లతో విసిగిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా పొత్తు కుదురుతుందనే వేచిచూస్తూ ఉంది.

అఖిలేష్ యాదవ్ కూడా…..

ఇక మధ్యప్రదేశ్ లో తామూ పోటీ చేస్తామంటూ అఖిలేష్ యాదవ్ కూడా సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన మధ్యప్రదేశ్ లో పర్యటించారు. తమకు బలమైన ఓటు బ్యాంకు ఇక్కడ ఉందని, గెలుపోటములను నిర్ణయించేది తామేనంటూ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో సమాజ్ వాదీ పార్టీని విస్తరించే ప్రక్రియలో భాగంగానే మధ్యప్రదేశ్ లో పోటీకి దిగుతున్నామని చెప్పారు. పొత్తుల విషయం తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

కాంగ్రెస్ కు న‌ష్టమేనా?

ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో కలసి పోటీ చేయలని నిర్ణయించాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీలూ కలిసే పోటీ చేసే అవకాశముంది. కాంగ్రెస్ కు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఈ రెండు పార్టీలతో కలసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పొత్తులు కుదరక విడివిడిగా పోటీ చేస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకే నష్టమని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చవద్దని కాంగ్రెస్ మొత్తుకుంటున్నా అఖిలేష్, మాయావతిలు విన్పించుకోవడం లేదు. ఈ రాష్ట్రాల్లో గెలుపొందాలంటే కొన్ని సీట్లు కాంగ్రెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి రాహుల్ గాంధీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 18020 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*