గెలవక ముందే….? ఇలా అయితే..??

rahulgandhi-tejaswai-yadav-bihar

ఎన్నికలు వచ్చేసరికి అసలు స్వరూపం బయటకు వస్తుంది. అంతకు ముందు ఐక్యంగా ఉన్న వాళ్లే ఎన్నికల సమయానికి తిరబడతారు. ఐదేళ్లు జైకొట్టిన వారే నై అనే ఛాన్స్ లేక పోలేదు. ఎన్నికల సమయంలో సంయమనం పాటించాల్సిన నేతలే రచ్చ రచ్చ చేసి పార్టీ పరువును బజారుకీడ్చేస్తారు మరికొందరు. ప్రధానంగా కూటమి కట్టడమంటేనే ఒక కళ. అందులో అన్ని పార్టీలకూ బలాబలాల ఆధారంగా సీట్ల పంపకం జరగాల్సి ఉంటుంది. కానీ సరైన నాయకత్వం లేకపోవడం, సీట్ల సర్దుబాటుపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల అనర్థాలు కూడా జరగక మానవు.

బీహార్ కూటమిలో…..

అచ్చంగా బీహార్ లో ఇదే జరుగుతుంది. ఇటు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలోనూ, కూటమిలోనూ మనస్పర్థలు ఏర్పడ్దాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల పంపకంలో అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కడంతో కూటమిలో లుకలుకలు బయలుదేరాయనే చెప్పాలి. ఇప్పటికే బీహార్ లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ లు వామపక్ష పార్టీలను పక్కన పెట్టాయి. దీంతో వారు విడిగా పోటీ చేస్తున్నారు. కామ్రేడ్ల వేరు కుంపటి మహాగడ్బందన్ కు ఇబ్బందనే చెప్పాలి.

లాలూ కుటుంబంలోనూ…..

ఇక తాజాగా లాలూ కుటుంబంలో రచ్చ అయింది. ఇప్పటికే తమ్ముడు తేజస్వీ యాదవ్ నాయకత్వంపై గుర్రుగా ఉన్న లాలూ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సీట్ల పంపకంపై ఫైరయ్యారు. ఏకంగా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ జహానాబాద్‌, శివ్‌హర్‌ స్థానాలకు కొన్ని పేర్లు ప్రతిపాదించారు. కానీ తేజస్వి యాదవ్ వాటిని పట్టించుకోకుండా ఇతరులకు కేటాయించడంతో ఆయన మండిపడుతున్నారు. బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి శతృఘ్న సిన్హాను రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై కూడా ఎటూ తేలలేదు.

బలంగా ఉన్న …..

మరోవైపు బీజేపీ కూటమి బలంగా ఉంది. బీహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బలమైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ, జేడీయూ సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇలా బీజేపీ కూటమి బీహార్ లో ముందుకు వెళుతుంటే, కాంగ్రెస్ కూటమి మాత్రం సీట్ల పంపకాలు తేలక సతమతమవుతోంది. అసంతృప్తి వాదలు హ్యాండిస్తే మాత్రం మళ్లీ ఇక్కడ కమలం జెండా ఎగరడం ఖాయమంటన్నారు పరిశీలకులు. మొత్తం బీహార్ లో మహా గడ్బంధన్ అనుకున్న దిశగా ముందుకు వెళ్లడం లేదన్నది వాస్తవం.

Ravi Batchali
About Ravi Batchali 19220 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*