టీడీపీలో రాజులు బోయీలేనా !!

rajus-community-in-telugudesamparty

ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ హవా కొనసాగించిన రాజులు గడచిన కొంతకాలంగా వెనకబడ్డారు. టీడీపీ ఆవిర్భావం తరువాత కూడా ఓ దశలో బాగానే రాణించిన ఈ సామాజిక వర్గం ఇపుడు గతంలో ఎన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థిని ఎదుర్కొంటోంది. విజయన‌గరం సంస్థానాధీశులుగా విశాఖ, విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన పూసపాటి వారి పలుకుబడి టీడీపీలో ఇపుడు బాగా తగ్గిపోతోంది. ఆ ప్రభావం వల్లనే రాజులకు కూడా పసుపు పార్టీ రాజకీయం వంటబట్టకుండా ఉందని అంటున్నారు.

చేజారుతున్న కోటలు…

ఇక విశాఖ జిల్లాలో రాజులకు పెట్టని కోటలుగా కొన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ వారిని తప్పించి వేరెవరినీ బరిలో నిలబెట్టే సంప్రదాయం కాంగ్రెస్, టీడీపీ రెండూ చేసేవి కావు. అలాంటి సీటు భీమునిపట్నం. ఇక్కడ రాజులు స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2004 వరకూ వారికి ఇక్కడ ఎదురులేకుండా పోయింది. ఆ తరువాతే మారిన పరిస్థితుల్లో టీడీపీ అక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను దువ్వడం ప్రారంభించింది. దాంతో ఈ సీటు రాజులకు గత మూడు ఎన్నికల నుంచి దక్కడంలేదు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో చోడవరం సీటు కూడా రాజులకు కేటాయిస్తూ వస్తున్న టీడీపీ ఈ మారు అది కూడా లేకుండా చేయాలనుకుంటోందని సమాచారం. ఇక్కడ నుంచి అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుని అసెంబ్లీ బరిలోకి దింపాలనుకుంటున్నట్లుగా సమాచారం.

అక్కడ ఎపుడూ లేదు….

విశాఖ జిల్లాలోని నర్శీపట్నం, ఎలమంచిలి అసెంబ్లీ సీట్లు కూడా రాజులకు గట్టి పట్టున్నవే. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అనేక సార్లు టికెట్లు ఇచ్చి క్షత్రియ సామజిక వర్గాన్న్ని గౌరవించించి. వైసీపే కూడా వచ్చే ఎన్నికల్లో యలమంచిలి టికెట్ కన్నబాబురాజు కి కేటాయించింది. విశాఖ ఉత్తరం కూడా కే కే రాజుకు ఇస్తారని టాక్. మరి టీడీపీని ఇన్నాళ్ళూ మోసిన రాజులకు ఆ పార్టీ మాత్రం రిక్త హస్తం చూపిస్తోందని గుస్సా అవుతున్నారు. గతంలో తనతో పాటు మరి కొందరికి టికెట్ ఇప్పించుకునే స్థితిలో పూసపాటి రాజులు ఉండేవారు. ఇపుడు మారిన రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపధ్యంలో ఆయన టికెట్ కే టిఖానా లేకుండా పోయిందని అంటున్నారు. మొత్తానికి రాజులు టీడీపీపై బాగానే మండిపడుతున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో భూములు కలిగి పరోక్ష పాలన చేస్తున్న రాజులు కొన్ని అసెంబ్లీ సీట్లలో తమ సత్తా చూపిస్తే అధికార టీడీపీకి అది షాక్ ఇస్తుందని అంటున్నారు. చూడాలి, టీడీపీ ఎలా సర్దుబాటు చేస్తుందో.

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*