రేవంత్ చెప్పినట్లే టీడీపీలో ఇప్పటికీ నడుస్తుందా?

ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఇప్పటీకీ టచ్ లో ఉన్నారా? టీడీపీని ఒక్క మాట కూడా అనకుండా రేవంత్ ఇక్కడ బండిని లాగేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రేవంత్ పై విమర్శలు తగ్గించారు. అలాగే చంద్రబాబు కూడా రేవంత్ పై సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారని చెబుతున్నారు. రేవంత్ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ వీడిపోయారని, రేవంత్ పై ఇప్పుడు విమర్శలు చేసి లాభమేంటని కూడా ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించడం దీనికి నిదర్శనం.

టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో….

రేవంత్ రెడ్డి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎంతకాదనుకున్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఓటుబ్యాంకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకుంటే అధికార టీఆర్ఎస్ పై విజయం సాధించడం సాధ్యమన్నది కాంగ్రెస్ నేతల వ్యూహం.

ముఖ్యనేతతో మంతనాలు….

ఇందుకోసం ఇప్పటికే రేవంత్ రెడ్డి అమరావతిలో ఉన్న టీడీపీ ముఖ్యనేతతో చర్చలు ప్రారంభించారని సమాచారం. కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తే విజయం ఖాయమని, టీడీపీకి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ బరిలోకి దిగకుండా ఉండేలా తాను చూసుకుంటానని రేవంత్ రెడ్డి టీడీపీ ముఖ్యనేతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో జత కడితే భవిష్యత్తులో టీడీపీ పునాదులు కూడా లేకుండా చేస్తారని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రతిపాదనపై చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

బాబుకూడా సుముఖత…..

గతంలోనే వచ్చే ఎన్నికల్లో తాము పొత్తుతో వెళతామని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపార్టీతో అన్నది ఆయన స్పష్టం చేయలేదు. టీఆర్ఎస్ తో వెళ్లాలని, విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లి నర్సింహులును చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రేవంత్ చెప్పినట్లే తెలంగాణ టీడీపీ వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్ తో పొత్తుపై అభ్యంతరాలను అధినేత వద్ద వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో చూద్దామంటూ టాపిక్ బాబు డైవర్ట్ చేశారని చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇప్పటికీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలు గాంధీభవన్ లోనే విన్పిస్తుండటం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 31115 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*