
వైఎస్ జగన్ తొలి క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాలిసిన అతి కొద్ది మందిలో నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా ఒకరు. అయితే సామాజికవర్గాల సమతూకంలో ఆర్కే రోజా ను పక్కన పెట్టక తప్పలేదు ముఖ్యమంత్రి జగన్ కి. దీనిపై అలకలు పూర్తి అయ్యాక ఎపి ఐఐసి చైర్మన్ ను చేసి క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవినే కట్టబెట్టి రోజా సేవలకు జగన్ న్యాయం చేశారు. ఇప్పుడు తాజాగా మరో కీలక బాధ్యతలు రోజాకి అప్పగించాలని సిఎం భావిస్తున్నట్లు వైసిపి వర్గాల్లో చర్చ నడుస్తుంది. సినీ హీరోయిన్ గా వెండితెరపై వెలిగిన రోజా అనుభవాలను ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ పరిశ్రమను ఆదుకోవడానికి వినియోగించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అనుమతుల కమిటీ బాధ్యత …
ఎపి లో సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ మధ్య తనను కలిసిన చిరంజీవి ఇతర ప్రముఖులతో ఇదే విషయాన్నీ కూడా జగన్ చర్చించారు. తాజాగా వైరస్ ఎఫెక్ట్ తో తీవ్ర కష్టాలు నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవడానికి సైతం జగన్ అందరికన్నా ముందుకు వచ్చారు. ఎపి లో షూటింగ్స్ కి ఉచితంగా అనుమతి ఇచ్చేందుకు సర్కార్ సన్నద్ధం అయ్యింది. ఇది సినీ పరిశ్రమకు ఎంతోకొంత ఊరట గానే చెప్పాలి.
టాలివుడ్ కమిటీకి….
ఈ షూటింగ్స్ కి అనుమతులు ఎలా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? వంటి అంశాలపై ఆర్కే రోజా కు ఉన్న అవగాహన జగన్ టీం లో ఎవరికి లేదనే చెప్పాలి. దాంతో చిత్ర పరిశ్రమపై జగన్ వేయబోయే కమిటీ బాధ్యతలు ఆర్కే రోజాకు అప్పగించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఎపి లో ప్రోత్సహాలు అందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ఒక పక్క నగరి ఎమ్యెల్యే బాధ్యతలు మరోపక్క ఏపిఐఐసి ఇంకోపక్క టాలీవుడ్ బాధ్యతలు ప్రభుత్వ పరంగా ఆర్కే రోజా చూస్తూ త్రిపాత్రాభినయం చేయనున్నారు.
Leave a Reply