రౌతు మెత్తనవ్వడం వల్లనే…??

routhu-suryaprakasharao-ysrcongress-party

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి విజయం తధ్యం అన్న టాక్ వచ్చిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ. అలాంటిది ఈ నియోజకవర్గం లో వైసిపి అభ్యర్థి సీనియర్ రాజకీయ వేత్త రౌతు సూర్య ప్రకాశ రావు స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడు తనయ ఆదిరెడ్డి భవాని పై 30 వేలకు మెజారిటీ తేడాతో ఘోర పరాజయం చెందారు. ఏపీలో వైసిపి సునామి సృష్టించిన సమయంలో కనీసం గట్టి పోటీ కూడా రౌతు ఇవ్వలేకపోవడం చర్చనీయాంశం అయ్యింది.

రోడ్డు కం రైలు వంతెన….

జగన్ పాదయాత్రగా రాజమండ్రి లో ప్రవేశించిన సమయంలో రోడ్ కం రైలు వంతెన జన ప్రవాహంతో షేక్ అయ్యింది. ఆ తరువాత టిడిపి మీడియా లో సైతం వైసిపి గ్యారంటీ గెలిచే సీట్లలో రాజమండ్రి సిటీ ప్రకటించబడింది కూడా. ఆ తరువాత చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థి ఎంపికలో అనుసరించిన వ్యూహం తో పాటు వ్యక్తిగత ఇమేజ్ ఆదిరెడ్డి భవాని కి ఆశీస్సులు అందించాయి. రౌతు పరాజయానికి టిడిపి అభ్యర్థి అఖండ విజయానికి దారితీసిన పరిస్థితులను ఒక్కసారి చూద్దాం.

రెండు సార్లు ఎమ్యెల్యే గా చూడటంతో ….

వాస్తవానికి రౌతు సూర్యప్రకాశ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్యెల్యే గా గెలిచి ప్రజలతో సన్నిహిత సంబంధాలే నెరిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన గెలిచిన రెండుసార్లు కూడా టిడిపి రాజకీయ దిగ్గజం గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై కావడం విశేషం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ రెండుసార్లు రాజమండ్రి సిటీ ఎమ్యెల్యేగా పోటీ చేసి బుచ్చయ్య చౌదరి చేతిలో ఓడిపోతే రౌతు మాత్రం అయన పై గెలిచి రికార్డ్ నెలకొల్పారు. 2014 లో వైసిపి నుంచి టికెట్ ఆఫర్ వున్నా పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా తప్పుకున్నారు. ఐదేళ్లు వైసిపి కో ఆర్డినేటర్ గా పార్టీని జనంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం గట్టిగానే చేశారు. అయితే ఇప్పుడు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఆదిరెడ్డి భవాని చేతిలో ఖంగు తినడానికి పోల్ మేనేజ్ మెంట్ తో పాటు రెండు సార్లు ఎమ్యెల్యేగా చూశాం కదా అని భావించి రాజమండ్రి వాసులు మార్పు కోరుకోవడం ఒక పాయింట్ గా నిలుస్తుంది.

పోల్ మేనేజ్ మెంటో లో టిడిపి దే… 

గత ఐదేళ్ళుగా రాజమండ్రి అసెంబ్లీ టికెట్ పై ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం గట్టి నమ్మకం పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తెచ్చుకుంటామన్న నమ్మకంతో ఒక ప్రణాళిక ప్రకారం క్షేత్ర స్థాయిలో సిటీ లోని అన్ని డివిజన్ లలో తనకంటూ ఒక వర్గాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఆదిరెడ్డి. పండగ వచ్చినా పబ్బం వచ్చినా, పెళ్ళైనా చావైనా నేనున్నా అంటూ ఆదిరెడ్డి ఆయన తనయుడు ప్రతి వారికి సాయం చేస్తూ రావడం అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందేలా చేసింది. ఇక పార్టీ టికెట్ ను కోడలు భవానికి ప్రకటించాక ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వైపు రాజకీయ ఉద్ధండులు, వ్యూహకర్తలు చేరిపోతున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత వర్గంతో పోల్ మేనేజ్ మెంట్ చేసుకున్నారు ఆదిరెడ్డి కుటుంబం. ఎర్రన్నాయుడు కుమార్తె గా భవానికి వున్న బ్రాండ్ నేమ్ కూడా ఆమె విజయంలో కొంత పాత్ర పోషించింది. భవాని అత్త మాజీ మేయర్ గా పనిచేసి ఉండటం, మామ అప్పారావు ఎమ్యెల్సీ గా ఉండటం, భర్తకు వున్న విస్తృత స్నేహితుల బృందాలు రాజకీయాల్లో కొత్తగా అరంగేట్రం చేసిన భవానికి అద్భుత బలాన్ని అందించాయి.

టిడిపి కంచుకోట రాజమండ్రి ….

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి సిటీ ని కంచుకోటగా మలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసిన గోరంట్ల బలమైన క్యాడర్ ను గ్రౌండ్ లెవెల్ లో నిర్మితం చేశారు. లీడర్ లు మోసం చేసినా క్యాడర్ మాత్రం పార్టీకే పనిచేసేలా అన్ని డివిజన్ లలో కరడుగట్టిన కార్యకర్తలు టిడిపికి ఇక్కడ బలం. అందుకే రాజమండ్రి కార్పొరేషన్ గా ఏర్పాటు అయ్యాకా ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో టిడిపినే విజయం సాధిస్తూ రికార్డ్ నెలకొల్పింది. పార్టీలో గ్రూప్ లు వున్నా ఎన్నికల సమయంలో అంతా కలిసి కట్టుగా పనిచేయడం కూడా టిడిపికి కలిసి వచ్చే అంశమే. ఇవన్నీ కూడా భవాని భారీ మెజారిటీకి కారణల్లో ఒకటి అని చెప్పొచ్చు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1080 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

1 Comment on రౌతు మెత్తనవ్వడం వల్లనే…??

  1. వాస్తవాలు గుర్తించడంలో …క్షైత్రసాయిలో సరైన సమాచారాన్ని అందించే యంత్రాంగం నియమించుకోవడంలో కానీ … మంత్రాంగం చేయగలిగిన సిబ్బంది కానీ.. బూత్ స్దాయిలో ఏజెంట్ల వ్యవస్ధను పటిష్టం చేయడంలో కానీ మరింత శ్రద్ద వహించి ఉంటే ఇలా జరిగేది కాదేమో …రౌతు సూర్యప్రకాశరావుగారు విజయం సాధిస్తారని బలమైన టాక్ వినిపించినా చివరకు తారుమారైంది… రామ్ నారాయణగారు మీరు చక్కగా ప్రెజంట్ చేశారు.. ఆయన సౌమ్యంగా ఉండటమే …???

Leave a Reply

Your email address will not be published.


*