వైసీపీలో క్యూ కట్టిన నేతలు…డేట్స్ ఫిక్స్

వైసీపీలో జోష్ పెరుగుతోంది. వరుసగా చేరికలు జరుగుతున్నాయి. సీనియర్ నేతలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీవైపు చూడటం ఆసక్తిగా మారింది. ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీలో జోష్ పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి నేతలు వైసీపీ వైపు వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఇదంతా జగన్ పాదయాత్ర మహిమేనంటున్నారు వైసీపీ నేతలు. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాతనే పార్టీకి మంచి ఊపు వచ్చిందని, ప్రజల్లో నిక్షిప్తమైన భావాలను గమనించే ఇతర పార్టీల నేతలు తమ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు.

కన్నా చేరిక 25న……

తాజాగా గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఈనెల 25వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జగన్ పార్టీ సీనియర్ నేతలతో ఇప్పటికే రెండు సార్లు చర్చించిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీన కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలోనే కన్నా పార్టీలో చేరతారని తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ రాకతో గుంటూరు జిల్లాలో వైసీపీ బలం మరింత పెరగనుంది. గత ఎన్నికల్లో గుంటూరు వైసీపీకి దెబ్బకొట్టింది. ఈసారి అలాకాకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు కండువా కప్పి స్వాగతం పలికేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

కన్నా చేరికతో…..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన కన్నాను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గంలో బలమైన నేత. వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఆ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. అందుకోసమే కన్నా లక్ష్మీనారాయణను వీలయినంత త్వరగా చేర్చుకుని జనసేనానికి తానేంటో తెలియజెప్పాలని జగన్ భావిస్తున్నారు.

వసంత 27న, కాటసాని 29న…..

ఇక కృష్ణా జిల్లాలో మరో కీలక నేత వసంత కృష్ణ ప్రసాద్ ఈ నెల 27వ తేదీన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు తేదీ ఫిక్స్ అయిందని వైసీపీ నేతలు చెప్పారు. వసంత కృష్ణ ప్రసాద్ ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వస్తుండటంతో కృష్ణా జిల్లాలో సయితం పార్టీ బలోపేతం అవుతుందని వైసీపీ భావిస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు. ఈయనకు మైలవరం టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను చేర్చుకోవడం ద్వారా జగన్ టీడీపీ, జనసేనలకు చెక్ పెట్టే అవకాశముందంటున్నారు. ఇక రాయలసీమలోని మరో కీలక నేత, బీజేపీ లీడర్ కాటసాని రాంభూపాల్ రెడ్డిఈ నెల 29న పార్టీలో చేరుతున్నారు. ఈ నెల ఆఖరి వారంలో వైసీపీలో సీనియర్ నేతల చేరికలు ఉండటంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా కన్పిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 30971 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*