ఆ ఏపీ మంత్రిని మ‌ళ్లి విప‌క్ష‌మే గెలిపిస్తుందా ?

ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంపై ప‌లు క‌థ‌నాలు ప్ర‌చారమ‌వుతున్నాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా రాఘ‌వ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి స్వ‌ల్ప‌ మెజారిటీతో గెలు పొందిన శిద్దాకు చంద్ర‌బాబు పిలిచి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఇక‌, ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. కాస్తో కూస్తో వ్య‌తిరేక‌త ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మంత్రి శిద్దాకే గెలిచే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి మంత్రి శిద్దాపై కొద్దిపాటి వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డం, మంత్రిగా ఉండి కూడా నియోజ‌క‌వ‌ర్గానికి ఆ రేంజ్‌లో నిధులు రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డం, ప‌లు కీలక అభివృద్ధి ప‌నుల విష‌యంలో కూడా
తాత్సారం జ‌రుగుతుండ డం వంటి ప‌రిణామాలు.. మంత్రి శిద్దాకు ఇబ్బందిక‌రంగా మారాయి.

అయితే, అదేస‌మ‌యంలో ఇక్క‌డ పుంజుకుంటుంద‌ని భావించిన విప‌క్షం.. ఆధిప‌త్య ధోర‌ణి నేప‌థ్యంలో నేత‌లు త‌మ‌లో తాము పోరాడుకుంటున్న క్ర‌మంలో వైసీపీ ఇక్క‌డ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌డం లేదు. వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈసారి తాను పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాదు, అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఒకింత గుర్రుగా కూడా ఉన్నారు. దీంతో ఆయ‌న కొన్నాళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత‌ జగన్‌.. బాదం మాధవరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించారు. అయితే, మాధవరెడ్డితో బూచేపల్లికి సత్సంబంధాల్లేవు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, నాయ‌కుల‌ను న‌డిపించ‌డం వంటి కీల‌క అంశాల్లో వైసీపీ శ్రేణులు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయి.

వాస్త‌వంగా చూస్తే ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఇన్‌చార్జ్‌గా నియ‌మించి బాదం మాధ‌వ‌రెడ్డి క‌న్నా బూచేప‌ల్లే బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతారు. ఆ ఫ్యామిలీకి ద‌ర్శితో పాటు సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ అనుచ‌ర‌గ‌ణం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న సిద్ధా మీద కేవ‌లం 1700 ఓట్ల‌తోనే ఓడిపోయారు. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా ఆ ఫ్యామిలీ ద‌ర్శిమీద ప‌ట్టు సాధిస్తూ వ‌స్తోంది. 2004లో శివ‌ప్ర‌సాద్‌రెడ్డి తండ్రి బూచేప‌ల్లి సుబ్బారెడ్డి పార్టీ టిక్కెట్ రాక‌పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజ‌యం సాధించారంటే ఇక్క‌డ వాళ్ల స‌త్తా ఎలాంటిదో తెలుస్తోంది.

బూచేప‌ల్లి త‌ప్పుకున్నాక‌ వైసీపీలో రెండు వ‌ర్గాల మ‌ధ్య అధికార ఆధిప‌త్యం కూడా పెరిగిపోయింది. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో నేత‌లు ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్ రెండుగా చీలిపోయింది. ఇదిలావుంటే, పార్టీ ప‌రంగా టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల‌ను అభివృద్ది చేస్తున్నారు. సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఒకింత స్త‌బ్దుగా ఉన్న టీడీపీ నేత‌ల వ్యూహం పుంజుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ .. టీడీపీ జెండానే ఎగురుతుంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే మంత్రిగా ఉన్న‌ప్ప‌ట‌కి సిద్ధాపై వ్య‌తిరేక‌త ఉన్నా విప‌క్ష వైసీపీలోని లుక‌లుక‌లే ఆయ‌న‌కు అనుకూలంగా మారేలా ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*