క్రాస్ ఓటింగ్ పైనే ఆశలన్నీ….!!!

sidharaghavarao-telugudesamparty

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఎన్నిక జరుగుతోంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే. ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన వారే. చివరి నిమిషంలో ఇద్దరికి టిక్కెట్ దక్కడంతో ప్రచారంలోకి హడావిడిగా దిగిపోయారు. నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ మిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాగుంట సుబ్బరామిరెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఆయన తెలుగదేశం పార్టీలో ఉండి చివరి నిమిషంలో వచ్చినా ఆయనకే టిక్కెట్ ఇచ్చింది.

అన్ని నియోజకవర్గాల్లో….

ఇక మాగుంటపైనే ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడంతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్దా రాఘవరావును బరిలోకి దించింది. ఆయన అయిష్టంగానే బరిలోకి దిగినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి పట్టుంది. దీనికి తోడు మాగుంట కుటుంబం ఓటు బ్యాంకు కూడా మరింత ప్లస్ అయింది. దీంతో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగీరి, దర్శి, కొండపి నియోజక వర్గాల్లో సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు.

కొంతలో కొంత….

గిద్దలూరు నుంచి పిడతల సాయికల్పనా రెడ్డి పార్టీలో చేరడం, కొండపిలో వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు అసంతృప్త నేతగా ఉండటం తనకు కలసి వస్తుందని శిద్ధా రాఘవరావు భావిస్తున్నారు. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ పైనే శిద్ధా ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థులకు ఓట్లేయకపోయినా తనకు అనుకూలంగా ఉంటారని శిద్ధా నమ్ముతున్నారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతాల్లో టీడీపీకి హోల్డ్ లేకపోవడంతో శిద్ధా ప్రత్యేకంగా సామాజికవర్గాలతో సమావేశమవుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.

మాగుంట బిందాస్ గా…..

మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పూర్తి భరోసాగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తన పట్టును నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం పదిహేను వేల ఓట్లతోనే ఓటమి పాలయిన మాగుంటకు ఈసారి పార్టీ గుర్తు కలసి వచ్చేలా ఉందన్నది ఆయన అభిప్రాయం. తన సొంత సర్వేలతో అంచనాకు వచ్చిన మాగుంట వైసీపీలో చేరడంతోనే దాదాపు అన్ని నియోజకవర్గాలో వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని తేలడమే నంటారు. శిద్ధా రాఘవరావు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నా క్రాస్ ఓటింగ్ ఆశతోనే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం లో ఇద్దరూ గెలుపుతమదేనన్న ధీమాతో ఉన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 39141 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*