ఇష్టం లేకున్నా…కష్టమయినా..??

sidharaghavaraotelugudesamparty

ఇష్టం లేదు.. అయినా త్యాగం చేయాల్సిన పరిస్థితి. గెలవలేమని తెలుసు. అయినా పోటీకి సిద్ధమవ్వాల్సిన తరుణం. ఇదీ మంత్రి శిద్ధారాఘవరావు పరిస్థితి. మంత్రి శిద్ధారాఘవరావు అయిష్టంగానే పార్లమెంటు సభ్యుడిగా బరిలోకి దిగుతున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి కోసం ఇంతగా వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి అధికార తెలుగుదేశం పార్టీకి తలెత్తిందంటే అది స్వయంకృతాపరాధామేనని చెప్పక తప్పదు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలసిందే. అయితే ఎంపీ అభ్యర్థిపై తాము పెట్టుకున్న అతి విశ్వాసమే పార్టీని కొంపముంచిందంటున్నారు. టీడీపీకి సరైన అభ్యర్థి దొరకకుండా పరిస్థితి మారడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి కూడా ఒక కారణమని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు.

మాగుంటనే చివరకు నమ్ముకుని….

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి గత ఎన్నికల్లో టీడీపీ తరుపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఏవీ సుబ్బారెడ్డి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. మాగుంట వంటి బలమైన నేతను కాపాడుకోవడంలో టీడీపీ అధినాయకత్వం ఫెయిలయిందని చెబుతున్నారు. మాగుంట ఎంపీగా ఓటమి పాలయినా చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మాగుంటేననికూడా స్పష్టంగా చెప్పారు. మాగుంటకూడా ఇందుకు తలూపారు.

టీడీపీకి ఝలక్ ఇవ్వడంతో…

కానీ రెండు సంవత్సరాలుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని అనేకమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. చివర వరకూ మాగుంట ఎటూ తేల్చకుండా ఉన్నారు. మాగుంట పేరును చంద్రబాబు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో మాగుంట తాను పోటీ చేయలేనని చేతులెత్తేశారు. టీడీపీ తరుపున పోటీ చేస్తే తనకు ఓటమి తప్పదని గ్రహించిన మాగుంట పోటీ నుంచి విరమించుకోవడంతో చంద్రబాబు అప్పటికప్పడు ఎంపీ అభ్యర్థిని వెదుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ బలమైన అభ్యర్థి మాగుంట వెళ్లిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గ్రానైట్ వ్యాపారవేత్త, మంత్రి శిద్ధారాఘవరావు పేరును ఖరారు చేశారు.

చరిత్ర పరికిస్తే…..

శిద్ధారాఘవరావు ఒంగోలు ఎంపీగా సరైన అభ్యర్థి కాదన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, సామాజిక వర్గమే మైనస్ పాయింట్ అవుతుందంటున్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, ఒంగోలు, కొండపి నియోజకవర్గాలున్నాయి. ఇందులో దర్శి తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. 1977 నుంచి జరిగిన ఎన్నికలను తీసుకుంటే ఒక్క 1999లో తప్ప ప్రతి ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుస్తున్నారు. 1999లో మాత్రం కరణం బలరాం టీడీపీ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటికి ఒంగోలు లోక్ సభను రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మరోవైపు వైసీపీ ఎంపీఅభ్యర్థిగా మాగుంట బరిలోకి దిగితే ఇక్కడ సైకిల్ విజయం కష్టమేనన్నది విశ్లేషకులఅంచనా. అందుకే ఈ ఎంపీ సీటుపై సైకిల్ పార్టీ ఆశలు వదిలేసుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 39142 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*