శిల్పా రివెంజ్ మామూలుగా లేదుగా….!!

తండ్రి శిల్పా మోహన్ రెడ్డి సాధించకపోయినా ఆయన తనయుడు కసితీర్చుకున్నారు. భూమా కుటుంబంపై విజయం సాధించి శిల్పా రవిచంద్రారెడ్డి కాలర్ ఎగరేశారు. శిల్పా కుటుంబం తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలో ఉంది. భూమా కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ శిల్పా ఉండరన్నది వేరే చెప్పనవసరం లేదు. గతంలో భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా నంద్యాలలో భూమా, శిల్పా కుటుంబాల మధ్య వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది.

భూమా ఏ పార్టీలో ఉంటే….?

2014 ఎన్నికలలో శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున బరిలోకి దిగగా, భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలోచేరారు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరగడంతో శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ టిక్కెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరి ఉప ఎన్నికలో పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. దాదాపు 28వేల మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. దీంతో శిల్పా మోహన్ రెడ్డి మనస్తాపానికి గురై రాజకీయాలకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నారు.తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు ముందు సవాల్ విసిరారు.

కొడుకును బరిలోకి దించి…

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో యువకుడైన భూమా బ్రహ్మానందరెడ్డి మీద తాను పోటీ చేయకూడదని శిల్పా నిర్ణయించుకని, ఆయన తనయుడు శిల్పా రవిచంద్రారెడ్డి ని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కేవలం ఏడాది పాటు ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిపైన అంత వ్యతిరేకత వస్తుందనుకోవడం నిజం కాదు. అయితే ఫ్యాన్ పార్టీ వేవ్ లో భూమా బ్రహ్మానందరెడ్డి కొట్టుకుపోయారు. తన తండ్రిని 28 వేల మెజారిటీతో ఓడించిన భూమా బ్రహ్మానందరెడ్డిని శిల్పా రవించంద్రారెడ్డి 33, 423 ఓట్లతో ఓడించి కసి తీర్చుకున్నారు.

అంతకంటే ఎక్కువగా…..

భూమా కుటుంబానికి ఈ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. నంద్యాల, ఆళ్లగడ్డల్లో ఓటమి పాలై వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. శిల్పా రవిచంద్రారెడ్డి విజయం వెనక తండ్రి శిల్పా మోహన్ రెడ్డి కారణమని చెప్పకతప్పదు. పోల్ మేనేజ్ మెంట్ దగ్గర నుంచి అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. కొడుకు రాజకీయ అరంగేట్రంలోనే ఆయన విజయాన్ని చవిచూపించారు. ఇలా శిల్పా మోహన్ రెడ్డి తాను ఉప ఎన్నికల్లో గెలవకున్నా ఈ ఎన్నికల్లో కుమారుడి విజయం చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మొత్తం మీద శిల్పా ఫ్యామిలీ మరోసారి నంద్యాలలో జెండా ఎగురవేసింది.

Ravi Batchali
About Ravi Batchali 31023 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*