
నటుడు.. ఇంటర్వెల్ సమయంలో సమైక్యాంధ్ర కన్వీనర్ అయిన శివాజీ ఇటీవల చిలక జోస్యం చెప్పుకొంటున్నాడని అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రత్యేక హోదా అంటూ అలుపెరుగని పోరాటం అంటూ.. గతంలో ఏవేవో కథలు చెప్పిన శివాజీ.. చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదని శాపనార్థాలు పెట్టాడు. ఇంతలోనే ఏమైందో.. తెరవెనుక ప్యాకేజీలు ఏం కుదిరియో.. దానిని వదిలేసి.. ఏకంగా చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని, ఒక్క సీటుకోసం ఇన్ని కుట్రలా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేకాదు.. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబుకు జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి మరో రెండు నోటీసులు రానున్నాయని జోస్యం జోరుగా వర్ణించాడు.
మోకాలికి…బోడిగుండుకు……
నోటీసుల జారీకి సంబంధించిన అన్ని చర్యలు పూర్తయ్యాయని, వీటి ద్వారా చంద్రబాబును బలి చేయడానికి కుట్రలు సాగుతున్నాయని చెప్పిన శి.. వాజీ.,. ఐదు నెలల క్రితం తాను చెప్పిన ఆపరేషన్ గరుడ నేడు అమలు చేస్తున్నారంటూ.. మోకాలికి.. బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేసి.. ఫెయిలయ్యాడు. అంతేకాదు. ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందని సెలవిచ్చాడు. బాబ్లీ కేసు ఒక ట్రాప్ అని, సీఎం చంద్రబాబు ఆ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. . ఆయన అక్కడి కోర్టుకెళ్లితే చాలా ఇబ్బంది పడతారని ఇలా ఏవేవో అని..అపర చాణిక్యుడైన చంద్రబాబుకే సలహాలు ఇవ్వడం తాతకు దగ్గులు నేర్పిన చందంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
పాపులారిటీకోసమా?
అంతేకాదు, బీజేపీ వారికి పదవీ వ్యామోహం పెరిగిపోయిందని సెలవిచ్చాడు. ఎంతటి అకృత్యానికైనా దిగజారుతారు. బీజేపీతో కుమ్మక్కు కాకపోతే జనవరిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పాడు? అంటూ ప్రశ్నలు సైతం సంధించాడు. కుట్రలు చేసి చంద్రబాబును జైలుకు పంపితే టీడీపీ ఎమ్మెల్యేలు జారిపోతారని, అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్లొచ్చనే ఉద్దేశంలో బీజేపీ, జగన్ ఉన్నారని కొన్ని దూషణలు సైతం చేసి.,. బాబు నుంచి మెచ్చుకోళ్లు ఆశించాడు. మొత్తానికి శివాజీ వారి చిలక జోస్యం అదిరిపోయిందని, సంబంధం లేని ధర్మాబాద్ కోర్టు ఘటనకు.. ప్రధాని మోడీ ఘటనలకు లింకు పెట్టి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో మరెన్ని పిట్టకథలు చెబుతాడో చూడాలని చలోక్తులు విసురుతున్నారు.
Leave a Reply