‘‘శివా‘‘లెత్తిపోతున్నారే…??

sivaprasad telugudesamparty

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్. ఆయన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకూ సుపరిచితమే. అయితే ఆయనకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. తనకు చిత్తూరు పార్లమెంటు స్థానం ఈసారి దక్కతుందా? లేదా? అన్న అంశం ఒకటయితే… ఇద్దరి అల్లుళ్ల మధ్య శివప్రసాద్ నలిగిపోతున్నారు. ఇద్దరు అల్లుళ్లు తమకు టిక్కెట్ కావాలని పట్టుపడుతుండమే శివప్రసాద్ కు పెద్ద సమస్య అయి కూర్చుంది. తన చేతిలో లేని అంశం కావడంతో ఆయన ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. శివప్రసాద్ కు కుమారులు లేరు. ఇద్దరూ కూతుళ్లే. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వారు జీవితంలో సెటిల్ అయ్యేలా చేయగలిగారు శివప్రసాద్. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత విచిత్ర వేషధారణతో శివప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన అల్లుళ్ల మధ్యలో చిక్కుకున్నారు.

పెద్దల్లుడు కన్ను దానిపైనే….

శిపప్రసాద్ పెద్ద అల్లుడు వేణు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. సినిమాల మీద పిచ్చి. వేషాలపై అమితాభిమానం. షార్ట్ ఫిల్మ్ లు తీస్తుంటారు. అయితే వేణు కన్ను రాజకీయాలపై పడింది. మామలాగానే తానూ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. 1999 ఎన్నికలలో శివప్రసాద్ సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో కొంతకాలం సమాచారశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణు భావిస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిత్య ఉన్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో వేణు అక్కడి నుంచి పోటీ చేస్తానని మామ వద్ద మారాం చేస్తున్నాడు.

మామ బాటలోనే….

కొన్నాళ్లుగా సత్యవేడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంతో శివప్రసాద్ కుటుంబానికి సంబంధాలున్నాయి. సత్యవేడు నుంచి 1999లో గెలిచిన శివప్రసాద్ 2004లో మాత్రం ఓటమిపాలయ్యారు. అక్కడి కార్యకర్తలతో వేణు తరచూ సమావేశమవుతూ తాను టిక్కెట్ రేసులో ఉన్నానని వేణు చెప్పకనే చెబుతున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని మామ శివప్రసాద్ పై వేణు వత్తిడి తెస్తున్నారు. ఇక మరో అల్లుడు నరసింహ ప్రసాద్. ఈయన తిరుపతిలో షార్ట్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఈయన కూడా మామలాగానే రాజకీయాల్లోకి రావాలని తెగ తపన పడిపోతున్నారు. అందుకోసం తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు.

చిన్నల్లుడు రూటు కూడా….

చిన్నల్లుడు నరసింహప్రసాద్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో అక్కడి టీడీపీ పెద్దలతో కూడా టచ్ లోకి వెళ్లారు. రెండు నెలల నుంచి నరసింహప్రసాద్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వాస్తవానికి నరసింహప్రసాద్ సొంత గ్రామం కూడా ఈనియోజకవర్గంలోనే ఉంది. నరసింహప్రసాద్ తండ్రి కడప జిల్లా వైద్యాధికారిగా పనిచేశారు. తనకు అవకాశం దొరకపోతుందా?అని ఎదురు చూస్తున్నారు. మామపై వత్తిడి పెంచారు. ఇలా విచిత్ర వేషాలు వేస్తూ అందరికీ వినోదం పంచే శివప్రసాద్ ఇప్పుడు ఇద్దరు అల్లుళ్ల రాజకీయాల మధ్య నలిగిపోతున్నారు. మరి శివప్రసాద్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*