స్టాలిన్ భయపెట్టిస్తున్నారే…..!

డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత స్టాలిన్ తన సమర్థతను చాటుకుంటున్నారు. కొత్త పార్టీలు వేళ్లూనుకోక ముందే ప్రజల్లోకి బలంగా తాను వెళ్లేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించారు. అయితే ఆయన ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ సయితం పార్టీ కోసం కసరత్తులు ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆయన పార్టీని ప్రకటించ అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు టీటీవీ దినకరన్ కూడా సొంత పార్టీతో దూసుకుపోతున్నారు.

సమర్థతను చాటుకోవడానికేనా?

ఈ నేపథ్యంలో పెద్దాయన కరుణానిధి లేని పార్టీని నడిపించాల్సిన బాధ్యత స్టాలిన్ పై పడింది. రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీలు ప్రజల్లోకి బలంగా వెళ్లకముందే తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు స్టాలిన్ విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు తమ చిరకాల ప్రత్యర్థి అయిన అన్నాడీఎంకేను టార్గెట్ గా కొన్ని రోజుల నుంచి చేసుకుని ముందుకు వెళుతున్నారు. అన్నాడీఎంకే సర్కార్ అవినీతితో వేళ్లూనుకుపోయిందని ఆధారాలతో సహా బయటపెడుతుండటం తమిళనాట సంచలనం కల్గిస్తోంది.

కీలక పత్రాలతో సహా…..

శాఖల వారీగా అవినీతిని ట్విటర్ వేదికగా స్టాలిన్ బయటపెడుతుండటంతో అన్నాడీఎంకే నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా స్టాలిన్ విద్యుత్తు శాఖను, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ప్రజాపనుల శాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ కీలక డాక్యుమెంట్లను స్టాలిన్ బయటపెడుతున్నారు. ఈ శాఖలకు చెందిన మంత్రులు తంగమణి, వేలుమణి, పళనిస్వామిలపై స్టాలిన్ ముందుగా గురిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్యుత్తు శాఖలో బొగ్గు దిగుమతి వ్యవహారాల్లో జరిగిన ఒప్పందాలను స్టాలిన్ బయట పెట్టడం అన్నాడీఎంకేలో కలకలం రేపింది.

కోవర్టులు ఎవరు….?

స్టాలిన్ కు అధికారులు ఎవరో సహకరిస్తున్నారన్నది అన్నాడీఎంకే అనుమానం. కీలక పత్రాలను ట్విట్టర్లో స్టాలిన్ పోస్ట్ చేస్తుండటంతో సెక్రటేరియట్ అధికారులే స్టాలిన్ తో చేతులు కలిపారని ముఖ్యమంత్రి పళనిస్వామి సయితం భావిస్తున్నారు. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. ఈ విచారణలో ఒక ఉన్నతాధికారే స్టాలిన్ కు సమాచారాన్ని లీక్ చేసినట్లు తెలియడంతో మంత్రులు సయితం నివ్వెర పోయారు. వెంటనే ఆ అధికారిని బదిలీ చేశారు. ఇకపై ఎటువంటి కీలక డాక్యుమెంట్లు బయటకు వెళ్లినా సహించేది లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నతాధికారుల సమీక్షలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. స్టాలిన్ కోవర్టులెవరో తెలుసుకుని వారిని ఏరిపారేయాలని పళనిస్వామి భావిస్తున్నారు. మొత్తం మీద స్టాలిన్ పై చేయి సాధించేందుకు వేస్తున్న ఎత్తులు అధికార పార్టీని మాత్రం ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*