ఈ సిట్టింగ్ కు… ఎలాంటి ఫిట్టింగ్ లో…!!

sugunamma-telugudesamparty

కాన్త వీక్ గా ఉన్నారంటే చాలు… టిక్కెట్ కోసం తెగ ప్రయత్నంచేస్తుంటారు ప్రత్యర్థులు. అధిష్టానం పట్టించుకోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఈ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అమరావతికి క్యూకట్టి మరీ సిట్టింగ్ కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తమ జిల్లా ఇన్ ఛార్జితో పాటు అవకాశముంటే అధినేతను కలసి వినతిపత్రాలను అందించి వస్తున్నారు. ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే అయినా ఒక రాయి విసిరితే పోలా? అనుకుంటూ అమరావతి బాట పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈ సెగ ఎక్కువగానే కన్పిస్తుంది. విడతల వారీగా తెలుగుతమ్ముళ్లు అమరావతికి చేరుకుంటూ సుగుణమ్మకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

గెలిచిన దగ్గర నుంచి….

భర్త వెంకటరమణ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సుగుణమ్మ తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమె గెలిచిన నాటి నుంచి పార్టీ ఆమెకు సహకరించలేదన్నది వాస్తవం. మహిళ కావడంతో ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో గ్రూపులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఆమె అల్లుడు పెత్తనాన్ని సహించలేమంటూ కొందరు అధిష్టానానికి ఇదివరకే ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికలలో తిరుపతి నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైనది. గట్టి పోటీ నెలకొంటుందనడంలో అతిశయోక్తి కాదు. వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బరిలో ఉండనున్నారు. అలాగే జనసేన కూడా ఇక్కడ బలంగా ఉండటంతో సుగుణమ్మ అయతే వీక్ క్యాండిడేట్ అవుతారని, ఆమెకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ నేతలు పట్టుబడుతున్నారు.

హౌసింగ్ స్కీమ్ వల్లనే…..

తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ కు, ఎమ్మెల్యే సుగుణమ్మకు చాలా కాలం నుంచి పడటం లేదు. ఇద్దరి మధ్య హౌసింగ్ స్కీమ్ వివాదం నడుస్తోంది. హౌసింగ్ స్కీమ్ లబ్దిదారుల ఎంపికలో తనను భాగస్వామ్యుడిని చేయలేదని నరసింహయాదవ్ అలకవహించారు. తిరుపతిలోని వికృతమాలలో నిర్మించదలచిన పక్కా గృహాల కోసం లబ్దిదారుల ఎంపిక చేపట్టారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నేతలే తమ వారికి కావాలంటూ పంచుకున్నారు. తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ కు వంద గృహాల లబ్దిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించారు. అయితే తనకు మరో వంద గృహాల లబ్దిదారుల ఎంపిక బాధ్యత కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఇందుకు సుగుణమ్మ అంగీకరించలేదు. ఇళ్లన్నీ కొందరికే దక్కుతుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆమె నచ్చ చెప్పడానికి చూసినా ఫలితం లేదు.

సుగుణమ్మకు వ్యతిరేకంగా…..

దీంతో నరసింహయాదవ్ సుగుణమ్మకు సీటు దక్కకుండా చేసేందుకు రోజుకు కొంతమందిని తనకు వ్యతరేకంగా ఫిర్యాదు చేయడానికి తిరుపతి నుంచి అమరావతికి పంపుతున్నారన్నది సుగుణమ్మ వర్గం ఆరోపణ. నాలుగురోజుల క్రితం నరసింహయాదవ్ తనకు తిరుపతి టిక్కెట్ కేటాయించాలంటూ నేరుగా అధినేత చంద్రబాబును కలసి విన్నవించుకు వచ్చారు. నరసింహయాదవ్ తో పాటు సుగుణమ్మకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలతలు కూడా జతయ్యారు. ఇప్పుడు సుగుణమ్మ టిక్కెట్ పై చంద్రబాబు సయితం డైలమాలో పడ్డారు. మరి సుగుణమ్మకు టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 29063 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*