
మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు శ్రీనివాస్ కళ్యాణ్ రావు నివాసం కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లో సొదాలు ఈడీ సోదాలు జరిపింది. శ్రీనివాస్ కల్యాణ్ రావుపై 2016 ఫిబ్రవరిలో సీబీఐ కేసు నమోదు చేసింది.
మూడు బ్యాంకుల నుంచి రుణాలు….
వ్యాపారాల పేరిట కొన్ని ఆస్తులు తనఖా పెట్టిన కల్యాణ రావు మూడు బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుం చి రూ.60 కోట్ల మేర రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. రుణాలు తీసుకున్న తర్వాత కల్యాణ రావు వాయిదాలు చెల్లించకపోవడంతో ఆయన తనఖా పెట్టిన ఆస్తులను ఆయా బ్యాంకులు పరిశీలించాయి. ఈ క్రమంలో సదరు ఆస్తులు నకిలీవిగా తేలినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పందించిన బ్యాంకులు సిబిఐని ఆశ్రయించాయి. ఈ కుట్రలో కీలక సూత్రదారులు మాజీ కేంద్ర మంత్రి సుజనా, అతని సన్నిహితులుగా అనుమానిస్తున్నారు.
సుజనా కంపెనీలో…..
బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టడానికి ముందు కళ్యాణ్ శ్రీనివాస్ మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్‌లోని పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. కల్యాణ్‌రావు కుటుంబ సభ్యులకు తెలిసి ఆయన ఇంకా సుజనా గ్రూప్‌కు సంబంధించిన కంపెనీల్లోనే ఉద్యోగిగా ఉన్నారు.ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి చెప్పబట్టే ఆయన సంతకాలు చేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కళ్యాణ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే కేంద్రమంత్రి, సుజనా గ్రూప్ వ్యవస్థాపకులు సత్యనారాయణ చౌదరి పాత్రపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
సుజనాకు భాగస్వామ్యం ఉందా?
అయితే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా సుజనా చౌదరికి భాగస్వామ్యం ఉందా అన్న విషయం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇతర అనుబంధ సంస్థలతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌ను కూడా విలీనం చేసుకోవాలని 2009లో మాతృసంస్థ నిర్ణయించింది.ఈ నిర్ణయం మేరకు ఇతర కంపెనీల విలీనం జరిగింది కానీ.. బెస్ట్ అండ్ క్రాంప్టప్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్‌ను మాత్రం బయట వ్యక్తులకు విక్రయించారు. 2013 సెప్టెంబర్ నాటి రికార్డుల ప్రకారం ఈ సంస్థలో ఇరవై మంది వాటాదారులున్నారు. ఇందులో ఒక సంస్థ మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్. ఇది సీషెల్స్ కేంద్రంగా ఉంది. 2013 తర్వాత ఈ సంస్థ ఆర్వోసీలో రిటర్న్స్ దాఖలు చేయలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌ను.. మారిషస్ కేంద్రంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కోనేరు హోల్డింగ్స్ లిమిటెడ్ టేకోవర్ చేసింది. సోకాన్ హోల్డింగ్స్, పీవీకే ఇంజనీర్స్, బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ సంస్థలను కోనేరు హోల్డింగ్స్ సొంతం చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
గుర్తించడం కష్టమేనా?
బయట దేశాల్లో నమోదైన కంపెనీలుండటం, దేశీయంగా రిజిస్టరైన కంపెనీల్లోనూ ఈక్విటీ హోల్డింగ్ రకరకాల మెలికలతో ఉండటంతో అసలు యజమానిని గుర్తించడం కష్టమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా సీబీఐ సమన్లు జారీ చేసిన ప్రస్తుత కేసులో బ్యాంకు రుణాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో చేసిన నాలుగు కంపెనీల వెనక ఉన్న వ్యక్తులను గుర్తిస్తే తప్ప కేసులో కళ్యాణ్ శ్రీనివాస్ పాత్ర, ప్రమేయాన్ని గుర్తించడం కష్టమే.అయితే ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు ఈ కేసు విషయంలో ఏ విధంగా వెళతారో అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Leave a Reply