సుమలత డిసైడ్ చేయనున్నారట….!!

sumalatha-kumaraswamy-mandya-constiuency

కన్నడ నాట రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ నెల 23వ తేదీ తర్వాత అటో ఇటో తేలిపోతుందన్న రీతిలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, భారతీయ జనతా పార్టీ ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మాండ్య నియోజకవర్గం ఫలితాలు కన్నడ రాజకీయాలపై కీలక భూమిక పోషించనున్నాయి. స్వతంత్ర అభ్యర్థి సుమలత విజయం సాధిస్తే సంకీర్ణ సర్కార్ దానికంతట అదే పతనమవుతుందన్న భావనలో బీజేపీ నేతలు ఉన్నారు.

రాజీనామా ఖాయమంటూ…..

బీజేపీ ఈ లెక్క కరెక్టేనంటున్నారు విశ్లేషకులు సయితం. సుమలత మాండ్య నియోజకవర్గంలో గెలుపు సాధిస్తే కుమారస్వామి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటున్న ప్రచారం ఊపందుకుంది. ఆయన వ్యవహార శైలి కూడా ఇందుకు అద్దం పడుతుంది. మాండ్య నియోజకవర్గంలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన సంగతి తెెలిసిందే. తుమకూరులో దేవెగౌడ, హాసన్ లో సోదరుడు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పోటీ చేశారు.

మాండ్య మీదనే….

ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు జనతాదళ్ ఎస్ అభ్యర్థులకు సహకరించడం లేదు. ముఖ్యంగా మాండ్య నియోజకవర్గంలో బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు సుమలతకు మద్దతు తెలిపారు. ప్రచారం కూడా నిర్వహించారు. దీని పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిఖిల్ గౌడకు మెజారిటీ రాదని ఇంటలిజెన్స్ నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో కుమారస్వామి తనయుడు విజయం కోసం పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.

పతనం తప్పదని….

మాండ్యలో సుమలత గెలిస్తే కుమారస్వామి ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్న ఆలోచనలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలు ఉన్నారు. అందుకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రభుత్వ పతనం ఖాయమని జోస్యం చెబుతున్నారు. దీంతో మాండ్య నియోజకవర్గం ఫలితమే కుమారస్వామి సర్కార్ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సుమలత గెలిస్తే ప్రభుత్వం మారుతుందని అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. మరి సుమలత ఏం చేయనున్నారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 19163 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*