బోడే టెన్షన్ వెనక అసలు కథ ఇదేనా….?

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తిరుగు లేదు. నాలుగున్నర ఏళ్లలో ఆయన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. చెయ్యాల్సినంత అభివృద్ధి చేశారు. ఆయనపై పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన నియోజకవర్గంలో టీడీపీ తిరుగులేని బలంగా ఉంటే వైసీపీ సంస్థాగతంగా బలహీనం అవ్వడంతో పాటు అక్కడ ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరో క్లారిటీ లేక సందిగ్ధ స్థితిలో ఉంది. ఇప్పుడు ఉన్న‌ పరిస్థితి బట్టీ చూస్తే విపక్ష వైసీపీ వాళ్లు సైతం ఆ టీడీపీ ఎమ్మెల్యే గెలవవ‌చ్చని అంచనా వేస్తున్నారు. అయినా ఆ టీడీపీ ఎమ్మెల్యేలో ఎందుకో గాని టెన్షన్‌ స్టార్ట్‌ అయ్యింది. మరి ఈ విచిత్రమైన టీడీపీ ఎమ్మెల్యే కథ ఏంటో తెలుగు పోస్ట్‌లో చూద్దాం.

మాస్ లీడర్ గా గుర్తింపు…..

కృష్ణా జిల్లాలో విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గం పెనమలూరు. టీడీపీకి సంస్థాగతంగానూ, క్షేత్ర స్థాయిలోనూ తిరుగులేని బలం ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తొలి సారి అసెంబ్లీకి పోటీ చేసిన బోడే ప్రసాద్ 31 వేల పైచిలుకుఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో ఈ ప్రాంతం రాజధాని ఏరియా కావడంతో జరిగిన అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా కూడా బాగానే అభివృద్ధి చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే బోడేకు మాస్‌ లీడర్‌గా తిరుగులేని గుర్తింపు ఉంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ప్రజల అవసరాలు తీర్చడంతో ఆయన మంచి పేరే సాధించారు. పార్టీ బలంగా ఉండడం కూడా ఆయనకు కలిసిరానుంది. కాల్‌మ‌నీ లాంటి వివాదాలు ఆయ‌న్ను చుట్టుముట్టినా అవి పెద్ద‌గా ఎఫెక్ట్ ప‌డ‌లేదు.

పార్థసారధికి కూడా…….

అటు నియోజకవర్గంలో వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్‌ అడ్రస్‌ లేకుండా పోవడంతో మాజీ మంత్రి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బందరు ఎంపీగా పోటీ చేసి ఓడిన కొలుసు పార్థసారధి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. పార్థసారధికి జగన్‌ నుంచి సరైన హామీ లేకపోవడంతో ఆయన సైతం ఇక్కడ పోటీ చేస్తారా ? లేదా అన్న సందిగ్ధ‌ పరిస్థితి నెలకొంది. ఇన్ని సానుకూల పరిస్థితులు ఉన్నా… ప్రస్తుతం ఇక్కడ టీడీపీకే ఎడ్జ్‌ ఉన్నా కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడే మాత్రం లోలోన టెన్షన్‌కు గురౌతున్నట్టే తెలుస్తోంది. మరి బోడే ఎందుకు ఈ టెన్షన్‌కు గురి అవుతున్నారని ఆరా తీస్తే వచ్చే ఎన్నికల్లో సీటుపై ఆయనకు సంపూర్తిగా గ్యారెంటీ లేకపోవడమే. బోడే పెనమలూరులో తిరుగులేని లీడర్‌గా ఉన్నా ఈ సీటు కమ్మ + బీసీ ఈక్వేషన్లలో టీడీపీకి తిరుగులేని కంచుకోట అవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీలోని మహామహులు అంతా కాచుకుని కూర్చుని ఉన్నారు.

సీటును త్యాగం చేయాల్సిందేనా….?

పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్‌ పేరు పెనమలూరు నుంచే బలంగా వినిపిస్తోంది. అలాగే లోకేష్ అనుకోని ప‌రిస్థితుల్లో హిందూపురానికి వెళ్తే బాలయ్య సైతం ఇక్కడ నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉండొచ్చు. ముందుగా లోకేష్‌కు ఫస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా పెనమలూరే ఉండడంతో లోకేష్‌ ఇక్కడ రంగంలో ఉంటే బోడే తన సీటును త్యాగం చెయ్యక తప్పదు. అలాగే కొద్ది రోజుల వరకు మైలవరంలో ఇబ్బంది ఎదుర్కుంటున్న మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం పెనమలూరు నుంచి పోటీ చెయ్యాలని ఓ ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు ఉమా కంటే లోకేష్‌తో పాటు పార్టీకే చెందిన ఇద్దరు ముగ్గురు సీనియర్లు సైతం పెనమలూరులో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చెయ్యడంతో బోడేకు కాస్త టెన్షన్‌ స్టాట్‌ అయ్యినట్టే తెలస్తోంది. చివరిలో ఎలాంటి సమీకరణలు మారకుండా బీఫామ్‌ చేతికి వచ్చేంత వరకు బోడేకు ఇక్కడ సీటు దక్కుతుందన్న గ్యారెంటీ మాత్రం కనపడడం లేదు. మరి బోడే తలరాత ఎలా ఉంటుందో ? చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 40447 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*