దగ్గుబాటి ఇలాకాలో ఇదీ పరిస్థితి…!!!

ప్ర‌కాశం జిల్లాలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నియోజకవర్గం పర్చూరు. పర్చూరు నియోజకవర్గం పేరు చెబితే మాజీ మంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, దివంగత ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుటుంబాల పేర్లు ప్రముఖంగా గుర్తుకు వస్తాయి. ఈ రెండు కుటుంబాలకు రాజకీయంగా ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగానూ, బాపట్ల నుంచి ఎంపీగా గెలిచారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన దగ్గుపాటి రామానాయుడు సైతం టీడీపీ నుంచి 1999లో ఎంపీగా గెలవగా, 2004లో ఎన్టీఆర్‌ కుమార్తె, వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి ఎంపీగా గెలిచారు. పురందేశ్వ‌రి ఆ త‌ర్వాత విశాఖ నుంచి కూడా ఎంపీగా గెలిచి కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు.

గత ఎన్నికల్లో…..

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియర్‌ రాజకీయ నేత అయిన గాదే వెంకటరెడ్డి పర్చూరులో మూడు సార్లు విజయం సాధించారు. ఆయనకు ఈ నియోజకవర్గంతో సుధీర్ఘ‌మైన అనుబంధం ఉంది. 1967లో ఇక్కడ నుంచి తొలి సారి విజయం సాధించిన గాదే ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు ఓడిపోయి తిరిగి 1991 ఉప ఎన్నికల్లో గెలవడం విశేషం. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు పదేవేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై విజయం సాధించారు. నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిలో ఏలూరి తనదైన ముద్ర వేశారు. 1500 కోట్ల రూపాయ‌లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఏలూరి అభివృద్ధిలో వైవిధ్యం చూపించడమే ఆయనకు కలిసి వచ్చింది.

వీరిది కీలక పాత్ర….

ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాక నియోజకవర్గంలో మూతపడిన, శిథిలమైన 25 ఎత్తిపోతల పథకాలను ఆయన తిరిగి యాక్టీవ్‌ చేయించారు. సుధీర్ఘ‌ కాలంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రెండు మూడు బ్రిడ్జిలను సైతం ఆయన పూర్తి చేయించారు. కాల్వల ఆధునికీకరణ‌కు రూ.100 కోట్ల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించుకుని ఆ పనులు పూర్తి అయ్యేలా చెయ్యడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో దూకుడుగా వెళ్తారన్న పేరున్నా పర్చూరు అభివృద్ధిలో ఏలూరి మార్క్‌ ముద్ర కనిపడింది అన్నది స్పష్టం అవుతోంది. దగ్గుపాటి, గాదె లాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఈ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించినా వారికి ధీటుగా, భిన్నంగా ఏలూరి ఇక్కడ అభివృద్ధి చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాజిక సమీకరణల పరంగా చూస్తే నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. ఆ నియోజకవర్గం నుంచి ఆ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. అలాగే రెడ్లు కూడా అభ్యర్థుల గెలుపు, ఓటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సమీకరణాలను చూస్తే…..

టీడీపీ ఎప్పుడు కమ్మ సామాజికవర్గానికే ఈ సీటు కేటాయిస్తుండంగా వైసీపీ సైతం జిల్లాల్లో మిగిలిన నియోజకవర్గాల సమీకరణల బట్టి పర్చూరు సీటును కమ్మలకే ఇస్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి భరత్‌ కుమార్‌ తను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్య‌న‌ని తప్పుకున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ ఇక్కడ నుంచి రావి రామనాధంకు నియోజకవర్గ భాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త అభ్యర్థిగా వచ్చిన రావి రామనాధంకు ఇప్పటికీ పర్చూరు వైసీపీలో పట్టు దొరకలేదన్నది మాత్రం వాస్తవం. వైసీపీ అధినేత జగన్‌ సైతం ఈ విషయంలో రామనాధంకు రెండు మూడు సార్లు వార్నింగులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

కొత్త అభ్యర్థిని నిర్ణయిస్తారా…?

మరో రెండు నెలల్లో నియోజకవర్గంలో పట్టు సాధించని పక్షంలో కొత్త అభ్యర్థిని చూడాల్సి వస్తుందని కూడా జగన్‌ స్ట్రాంగ్‌గానే హేచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. పర్చూలు టీడీపీ సాంస్థాగతంగానూ బలంగా ఉంది, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి స్ట్రాంగానే ఉన్నారు. అటు విపక్ష వైసీపీ టీడీపీ జోరుతో పోలిస్తే బేజారుగానూ ఉంది అటు ఆ పార్టీకి సరైన అభ్యర్థి కూడా కురువు అయ్యారు. ఇక కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే జనసేన ప్రభావం పర్చూరులో శూన్యం అనే చెప్పాలి.

Ravi Batchali
About Ravi Batchali 37845 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*