ఆ…నలుగురిలో సెలెక్ట్ చేసింది వీరినేనా?

telugudesamparty-andhrapradesh-mlc-elections

అధికార తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువయ్యారు.ప్రధానంగా త్వరలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పొంగూరి నారాయణ, యనమల రామకృష్ణుడు, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, శమంతకమణిల పదవీ కాలం పూర్తయింది. శాసనసభలో బలాబలాలను పరిశీలిస్తే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు తెలుగుదేశం పార్టీకి దక్కుతాయి. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఇస్తామని ప్రకటించారు.

నాలుగు స్థానాలు దక్కనుండటంతో….

ఇక టీడీపీకి దక్కే నాలుగు స్థానాలు ఎవరికనేవి ఇంకా అధినేత తేల్చలేదు. ఇందులో ప్రస్తుతం ఆర్థికమంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడిని తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు. ఆయన తుని నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతుండటంతో ఆయనను తిరిగి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించనున్నారు. ఇక మరో మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఆయన పోటీకి చంద్రబాబు సయితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దీంతో ఈసారి నారాయణను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయరనేది దాదాపుగా తేలిపోయింది.

యనమలకు ఒకటి…..

యనమల రామకృష్ణుడికి ఇవ్వగా ఇక మూడు స్థానాలు మాత్రమే టీడీపీ చెంత ఉంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శమంతకమణి, లక్ష్మీ శివకుమారిలకు ఛాన్స్ లేదంటున్నారు. ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి అర్బన్ స్థానాన్ని కోరుకుంటున్నారు. ఆయనకు గాని ఆయన కోడలు కు గాని ఆ సీటును ఆశిస్తున్నారు. శమంతకమణి, శివకుమారిలకు ఈసారి ఛాన్స్ లేదని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అంటే ముగ్గురు కొత్త వారికి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కే అవకాశముందంటున్నారు.

వంగవీటి రాధాకు కూడా….

అయితే ఇప్పటికే చంద్రబాబునాయుడు పార్టీలో చేరుతున్న సందర్భంగా కొందరు నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా బెజవాడ నేత వంగవీటి రాధా ఉన్నారు. ఈ నెల 22వ తేదీన రాధా టీడీపీలో చేరతారని తెలుస్తోంది. మూడు స్థానాల్లో ఒకటి వంగవీటి రాధాకు కన్ఫర్మ్ అయినట్లే. ఇక ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సినీనటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ ఏపీ ఎన్జీవో నేతగా ఉన్న అశోక్ బాబుకు కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో టీడీపీని నమ్ముకుని ఉన్న పాతకాపులకు ఈసారి ఛాన్స్ దక్కదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మరి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 33703 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*