‘‘కల్యాణ’’ వైరాగ్యమేనా..??

telugudesamparty in kallyanadurgam constiuency

నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కల్యాణదుర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పేలాలేవు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ఆయనను విత్ డ్రా చేయించేందుకు మాత్రం పెద్దయెత్తున ప్రయత్నాలను ప్రారంభించారు టీడీపీ నేతలు. ఇక్కడ తెలుగుదేశంపార్టీ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వలేదు. జేసీ దివాకర్ రెడ్డి పట్టుబట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి స్థానంలో ఉమామహేశ్వరనాయుడికి టిక్కెట్ టీడీపీ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

అత్యధిక మెజారిటీతో గెలిచినా….

గత ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామిపై దాదాపు ముప్ఫయి వేల మెజారిటీతో గెలుపొందారు. హనుమంతరాయ చౌదరి తొలి నుంచి తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉందని సర్వేలో తేలిందని చెప్పి ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కల్యాణదుర్గం విషయంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా తొలినుంచిఒకే మాట మీద ఉన్నారు. అక్కడి అభ్యర్థిని మార్చాలని చెబుతూ వస్తున్నారు. ఈమేరకే ఆయనను తప్పించి కొత్త నేత ఉమామహేశ్వరనాయుడికి టిక్కెట్ ఇచ్చారు.

రెబెల్ గా బరిలోకి దిగి….

దీంతో రగలిపోయిన ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ల తొలిరోజే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోసారి కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ల గడువు ముగియడం, పరిశీలన పూర్తవ్వడంతో హనుమంతరాయచౌదరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తాను పోటీలో ఉండటం ఖాయమని ఆయన తేల్చిచెబుతున్నారు. ఉన్నంను శాంతింప చేయడానికి టీడీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి కూడా ఫోన్లో మాట్లాడరు. కానీ ఆయన తనసత్తా ఏంటో ఎన్నికల్లో చూపుతానని చెబుతున్నారు.

బాబు బుజ్జగింపులకు….

కానీ చంద్రబాబు తో ఉన్నం భేటీకి తెలుగుదేశం నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు చెబితే ఉన్నం వింటారని చివరి ఆశ. ఆయన బరిలో నుంచి తప్పుకుంటేనే టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరరావుకు కొంత ఛాన్స్ ఉంటుంది. లేకుంటే టీడీపీ అభ్యర్థికి కష్టాలు తప్పవు. చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత ఉన్నం తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు నుంచి తనకు ఎమ్మెల్సీ ఇస్తానని స్పష్టమైన హామీ లభిస్తే ఆయన పోటీ నుంచి తప్పుకుంటారని ఉన్నం అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ బరిలో ఉన్నారు. మరి ఉన్నం తప్పుకుంటారా? రెబల్ గానే ఉంటారా? అన్నది నేడు తేలనుంది. ఆయన బరిలో ఉంటే కల్యాణ్ దుర్గంలో టీడీపీకి కష్టకాలమే.

Ravi Batchali
About Ravi Batchali 40447 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*