ఈ టీడీపీ లీడర్ ది అంతా రివర్స్ గేర్…. !!

telugudesamparty leader in reverse gear

నేనే నంబర్ వన్ అని విశాఖ అర్బన్ జిల్లా ఉత్తర నియోజకవర్గం టీడీపీ నాయకుడు ఒకరు హ్యాపీగా పాట పాడుకుంటున్నారు. నన్ను మించిన వారు లేరు. నాకు సాటి పోటీ లేనేలేదని కూడా ఆయన ధీమాగా ఉన్నారు. టీడీపీలో టికెట్టూ నాదే, ఆనక విజయమూ నాదే అంటూ రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే తానేనని కూడా గట్టిగా డిసైడ్ అయిపోయారు. టీడీపీలో ఎందరో ఆశావహులు ఉంటే వారందరికంటే కూడా తానే ముందు అనిపించుకోవడానికి ఓ స్వతంత్ర సంస్థ ద్వారా సర్వే చేయించి ఆ ఫలితాలను ఏకంగా హై కమాండ్ కి పంపారు. ఎక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నదానిపై బాబు ఓ పక్కన సర్వేలు చేయిస్తూంటే రివర్స్ గేర్లో ఈ నాయకుడు సొంత సర్వేలు చేయించి తనకే టికెట్ ఇవ్వాలని కోరడం విశేషం.

రియల్టర్ గా పేరు….

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భారీ రియల్టర్ గా ఆయనకు పేరు. ఆ సంస్థ పేరే ఆయన ఇంటి పేరుగా ప్రచారం అయిపోయింది. ఆయనే స్వాతి క్రిష్ణారెడ్డి. మూడేళ్ళ క్రితం టీడీపీలో చేరినా క్రిష్ణారెడ్డి అప్పట్లో విశాఖ మేయర్ పోస్ట్ ఆశించారు. జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడంతో ఆయన ఎపుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన చాలాకాలంగా ఉత్తరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలో పేరు తెచ్చుకున్నారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో క్రిష్ణారెడ్డి కి టీడీపీలో టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలుస్తారని వెల్లడైందట. ఆ సర్వే మరి ఆయనే జరిపించారని ప్రచారంలో ఉంది. దాంతో ఇపుడు టీడీపీలోని మిగిలిన ఆశావహులు క్రిష్ణారెడ్డి తెలివితేటలకు షాక్ తింటున్నారుట.

ఆ సామాజికవర్గం కోటా….

నిజానికి విశాఖ జిల్లా టీడీపీలో రెడ్డి సామాజిక వర్గానికి అసలు ప్రాముఖ్యత లేదు. రెడ్లు కాంగ్రెస్ లేదా వైసీపీలోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఏరీ కోరీ మరీ టీడీపీని ఎంచుకున్న క్రిష్ణారెడ్డి బలమైన రెడ్డి సామాజిక వర్గం కోటాలో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీలో ఆ వర్గానికి న్యాయం చేయాలని కూడా ఆయన అంటున్నారు. టీడీపీ అంటే ఒక సామాజిక వర్గానికే పరిమితమన్న మచ్చ పోవాలంటే తనకే కచ్చితంగా టికెట్ వస్తుందని కూడా ఆయన ఆశాభావంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఉత్తరం సీటు ఇపుడు హాట్ ఫావరేట్ గా ఉంది. ఎందరో అక్కడ కర్చీఫ్ వేశారు. మరి వారిని కాదని క్రిష్ణారెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని కూడా అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Ravi Batchali
About Ravi Batchali 35929 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*