
అన్ని పార్టీల్లో టికెట్ల లొల్లి తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధికారపార్టీలో ఆశావహులు అధిష్టానం ప్రకటించే వరకు ఓపిక పట్టలేకపోతున్నారు. కొందరు రధసప్తమి వెళ్ళాక మంచి ముహూర్తం చూసుకుని టికెట్ మాకే వచ్చేసిందని స్వయంగా ప్రకటించుకోవడం కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తుంది. దీనిని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో అధిష్టానానికి అర్ధం కానీ పరిస్థితి ఎదురౌతుంది. ఎందుకంటే ఇలా ప్రకటించుకున్న వారిపై గట్టిగా ఆగ్రహిస్తే క్షణాల్లో పార్టీ మార్చేస్తారేమో అన్న భయం సైకిల్ పార్టీని భయపెడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా టికెట్ ప్రకటించుకుంటే వారి ప్రత్యర్దులతోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించి సరిపెట్టుకుంటుంది టిడిపి.
ఇప్పుడు కర్నూలు వంతు …
ఎవరైనా ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు భేటీ అయ్యారంటే చాలు ఫలానా వారికి టికెట్ గ్యారంటీ అనే రీతిలో మీడియా లో ప్రచారం సాగిపోతుంది. లేదంటే వచ్చే ఎన్నికల టికెట్ మాదే అని వారు ప్రకటించుకోవడమో జరిగిపోతున్నాయి. జలీల్ ఖాన్ వ్యవహారం అలాగే సాగింది. ఆయనకు టికెట్ కి నో చెప్పిన బాబు ఖాన్ కూతురు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని హామీనిచ్చారు. ఆ విషయం అంతర్గతమైనది అయినప్పటికీ జలీల్ ఖాన్ మీడియా ఎదుట బాబుతో జరిగిన రహస్య భేటీ వివరాలు వెల్లడించేశారు. ఆ వ్యవహారం పార్టీలో దుమారం రేపింది ఇప్పుడు కర్నూలు జిల్లా నేత ఎస్వీ మోహన్ రెడ్డి తనకే టికెట్ అని ప్రకటించడం తో కర్నూలు పై తన కుమారుడి కోసం కన్నేసిన టిజి వెంకటేష్ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు.
ఆయన ఎవరు ప్రకటించుకోవడానికి …?
మోహన్ రెడ్డి ఎవరు స్వయంగా ప్రకటించుకోవడానికిజజజటజ దీనికో పద్ధతి వుంది, సర్వేలు వున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఒకరోజు టికెట్ నాదే అన్న మోహన్ రెడ్డి ఆ తరువాత మంత్రి నారా లోకేష్ ను ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ ఆహ్వానించడం చిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. లోకేష్ టిడిపి అధిష్టానంలో కుటుంబ సభ్యుడు కనుక ఆయన పోటీ చేస్తే ఎవరైనా సహకరించాలని మోహన్ రెడ్డే కాదని నిప్పులు చెరిగారు. టిజి ఇంతలా ఫైర్ కావడం వెనుక అధిష్టానం సపోర్ట్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతున్నా తమ్ముళ్లు తొందరపడటంపై బాబుకు వీరి వైఖరి తలనొప్పులు తెప్పిస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తుంది. ఈ సమస్య నుంచి ఆయన గట్టేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి.
Leave a Reply