తోటకు అక్కడే దెబ్బ తగిలింది …!!!

తోట త్రిమూర్తులు

కులాల కురుక్షేత్రం గా వుండే నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఒకటి. ఇక్కడ పోటీ పార్టీల నడుమ కాకుండా రెండు సామాజిక వర్గాల నడుమ నడుస్తుంది. ఇలాంటి చోట టిడిపి, జనసేన ల నుంచి కాపు సామాజిక వర్గం నుంచే రంగంలోకి దిగడం ఖరారు అయినవెంటనే సిట్టింగ్ ఎమ్యెల్యే తోట ఓటమి ఖాయం అయిపొయింది. దీనికి తోడు తొలినుంచి తోటకు అండగా వున్న కాపు సామాజికవర్గం క్యాడర్ జనసేనకు జై కొట్టేశారు. ఇది గుర్తించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. దాంతో వారంతా క్రాస్ ఓటింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ డిసిషన్ కూడా తోటకు గట్టిగానే దెబ్బతీసింది.

కాపు సామాజిక వర్గంలో గందరగోళం ….

ఎమ్యెల్యే తోటకు ఎంపికి జనసేన అభ్యర్ధికి అంటూ సాగిన కాపు సామాజిక వర్గ ప్రచారం కింది స్థాయిలో అర్ధం చేసుకోవడంలో గందరగోళం ఏర్పడింది. ఈ విషయాన్నీ కూడా గుర్తించిన త్రిమూర్తులు క్రాస్ ఓటింగ్ ప్రచారం ఆపండిరా బాబు అంటూ పోలింగ్ రోజు బూత్ బూత్ తిరిగి వేడుకున్నా జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోయింది. జిల్లా పరిషత్తు మాజీ ఛైర్మెన్ గా వైసిపి నుంచి పోటీచేసిన చెల్లుబోయిన వేణుగోపాల్ త్రిమూర్తులపై అద్భుత విజయాన్ని అందుకున్నారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశీస్సులతో పోటీ చేసిన వేణు కౌంటింగ్ లో తొలి నుంచి గట్టి పోటీనే ఇచ్చారు. రామచంద్రపురం అర్బన్ కాజులూరు మండలాల్లో తోట హవా సాగినా గంగవరం మండలం కౌంటింగ్ మొదలయ్యాకా త్రిమూర్తులు మెజారిటీ తొక్కిపెట్టి ఏడువేల పైచీలుకు ఓట్ల ఆధిక్యంలోకి దూసుకుపోయారు.

ఆ తడబాటు కూడా దెబ్బ కొట్టింది …

అభ్యర్థుల ప్రకటనకు ముందు తోట త్రిమూర్తులు పార్టీ మారనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జగన్ పాదయాత్ర సందర్భంలో వైసిపి లోకి వచ్చేస్తున్నంత హడావుడిని త్రిమూర్తుల కోటరీ సృష్ట్టించింది. వారు పెట్టిన కొన్ని ఫ్లెక్సీలు సైతం జనంలో అనుమానాలు కలిగించాయి. తనకు తన కుమారుడికి రెండు టికెట్లు ఇస్తే పార్టీ లోకి వస్తాను అని త్రిమూర్తులు ఆఫర్ పెట్టినట్లు ప్రచారం నడిచింది. జగన్ దానికి నిరాకరించడంతో ఆయన టిడిపి లోనే కొనసాగాలన్న నిర్ణయం తీసుకున్నారని తోట వర్గంలో టాక్ వచ్చింది. ఆ తరువాత త్రిమూర్తులు జనసేన లోకి రావాలని ఆయన సామాజిక వర్గంనుంచి గట్టి వత్తిడి వచ్చింది.

జనసేనలోకి వెళతారని….?

తోట కుమారుడి వివాహానికి పవన్ కళ్యాణ్ విచ్చేయడం, జనసేన అధినేత రామచంద్రపురం లో ఏర్పాటు చేసిన సభలో సైతం సిట్టింగ్ ఎమ్యెల్యేను విమర్శించకపోవడం మరింత అనుమానాలు రేకెత్తేలా చేసింది. ఈ వ్యవహారాలన్నీ గమనించిన టిడిపి అధిష్టానం పార్టీ ఫండ్ కింద ఎన్నికల ఖర్చులకు ఇస్తానన్న సొమ్ము కూడా సగమే పంపడం కూడా పోల్ మేనేజ్మెంట్ ను దెబ్బ తీసింది. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు టిడిపి ఫైర్ బ్రాండ్ త్రిమూర్తుల పరాజయనికి దారి తీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1698 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*