ఉండవల్లి వ్యూస్

‘‘ఇందిర సోషలిస్టు ప్యాట్రన్ ని మొరార్జీ దేశాయి, సిండికేట్ వ్యతిరేకించింది. సంజీవరెడ్డిని కాంగ్రెస్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపింది. ఆయన గెలిస్తే ఇందిర అవుట్ ఆమె నిర్ణయాలను ఏది ఆయన అంగీకరించరని తెలిసిన ఇందిరాగాంధీ వివి గిరి చేత ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేయించింది. ఆ ఎన్నికల్లో సంజీవ రెడ్డి నెగ్గి ఉంటే ఇందిర అవుట్ అయ్యేవారు. ఆమె చరిత్ర అక్కడితో క్లోజ్ అయ్యి ఉండేది. కానీ ఆమె రిస్క్ తీసుకున్నారు. సంజీవరెడ్డి ఆమె చెప్పింది ఏమి చేయరు. వివి గిరి ఏమి చెప్పినా చేస్తారనేది ఇందిర ఆలోచన. వాస్తవానికి సంజీవరెడ్డి కి నాటి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చినా రాష్ట్రపతి ఎన్నికల్లో మూడో అభ్యర్థి దేశముఖ్ డిస్ క్వాలిఫై కావడంతో ఆయనకు పడిన రెండో ప్రాధాన్యత ఓట్లతో వివిగిరి కి కలవడంతో ఆయన విజయం సాధించారు. సంజీవ రెడ్డి నాడు నెగ్గివుంటే ఇందిరాగాంధీ రిజైన్ చేసి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. వివి గిరి గెలిచాకా ఇందిర తాను అనుకున్న నిర్ణయాలపై ఆర్డినెన్స్ ఇచ్చేసింది. బ్యాంక్ ల జాతీయకరణ వంటివన్నీ వీటిని కోర్ట్ కొట్టేసింది. దాంతో ఇందిర ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్ విడిపోయింది. ఒకటి ఆర్ కాంగ్రెస్ రివిజనిస్ట్ రీఫార్మిస్ట్ పాత కాంగ్రెస్ గా. మన సంజీవ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉండటంతో రెడ్డి కాంగ్రెస్ అని ఇక్కడ పిలిచేవారు. ఇందిర సొంతంగా పోటీ చేస్తే దేశవ్యాప్తంగా 352 సీట్లు సాధించారు. పబ్లిక్ ఆమెను ప్రధాని పీఠంపై తిరిగి కూర్చో బెట్టారు. పార్టీ అంతా వ్యతిరేకించినా పబ్లిక్ ఆమెతో ఉండటంతో ఇందిరాగాంధీ తిరిగి విజయకేతనం ఎగురవేసింది.’’ అని చెప్పారు ఉండవల్లి.

ఆవుదూడపై రాజ్ నారాయణ కేసు …

‘‘ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని జీర్ణించుకోలేని ఆమె ప్రత్యర్ధులు లో ఒకరైన రాజ్ నారాయణ ఆవుదూడ గుర్తు మీద కోర్ట్ కి వెళ్ళాడు. ఇది మత పరమైన గుర్తు అని ఈ ఎన్నిక చెల్లదంటూ వాదించారు. ఆవిడ భారీగా డబ్బు ఖర్చు పెట్టిందని, ఇదంతా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ రకరకాలుగా వేశారు. అలహాబాద్ హై కోర్ట్ జూన్ 12 న దీనిపై ఇచ్చిన తీర్పు దేశంలో సంచలనానికి తెరలేపింది. జస్టిస్ సిన్హా రెండు కారణాల వల్ల ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారు. వాటిలో ఒకటి ఆమె ప్రభుత్వ సొమ్మును ప్రచార కార్యక్రమాలకు వినియోగించారని, రెండు ప్రధాని ఓఎస్డీ ఎస్పాల్ కపూర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించకుండా ఆయన ఇందిర చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారంటూ ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంది. తీర్పు ఇస్తూ 20 రోజుల్లో సుప్రీం లో కేసు అప్పీల్ చేసుకోవొచ్చని కూడా అందులో సిన్హా తెలిపారు.’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

జయప్రకాశ్ నారాయణ ను…

‘‘దేశంలో అత్యంత జనాదరణ కలిగిన నెహ్రు సమకాలికుడు, అంతకన్నా ఎక్కువే ఏమో కూడా అయిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ను ఇందిర ను ఎదుర్కొనేందుకు ఆమె వ్యతిరేకులు రంగంలోకి దించారు. ఇందిర ను మాములుగా ఏమీ చేయలేమని అర్ధం కావడంతో ఆమె ప్రత్యర్ధులు ఈ ఎత్తుగడ వేశారు. విప్లవకారుడిగా పేరున్న జెపి రంగంలోకి దిగేటప్పటికీ ఇందిర సైతం భయపడ్డారు. గుజరాత్ లో 163 స్థానాలకు 142 స్థానాలు గెలిచిన చమన్ భాయ్ పటేల్ పై ఇందిర వ్యతిరేకులు ఉద్యమం ప్రారంభించారు. ఆయనది అవినీతి ప్రభుత్వం అంటూ సాగిన ఉద్యమానికి తలొగ్గిన ఇందిర అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దాంతో చమన్ భాయ్ ఇందిరపై ఆగ్రహం తో సొంత పార్టీ పెట్టేశారు. తక్షణం ఎన్నికలు నిర్వహించాలన్న విపక్షాల డిమాండ్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచినా 12 సీట్లు గెలిచిన చమన్ భాయ్ తో చేతులు కలిపి ఇందిర వ్యతిరేకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు. అప్పుడు ఇందిర కు క్లారిటీ వచ్చింది. విపక్షాల యుద్ధం అవినీతిపై కాదని తనపైనే అని గ్రహించారు’’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు …

‘‘అలహాబాద్ హై కోర్ట్ లో జస్టిస్ సిన్హా ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కి వెళ్లిన ఇందిర కు సుప్రీం ఊరట కల్పించింది. జస్టిస్ కృష్ణయ్యర్ ఈ కేసు విచారణ పూర్తి అయ్యేవరకు ఆమె పదవినుంచి దిగాలిసిన అవసరం లేదంటూ స్టే మంజూరు చేశారు. ఎంపీగా ఆమె జీతం తీసుకోకూడదని లోక్ సభలో జరిగే ఓటింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకోరాదని ప్రధానిగా కొనసాగవచ్చని పేర్కొంది సుప్రీం కోర్ట్. ఈ నేపథ్యంలో జయప్రకాశ్ నారాయణ ఢిల్లీ లో జూన్ 25 న రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. ఆయన పిలుపిస్తే వేలసంఖ్యలో జనం తరలివచ్చే పరిస్థితి నాటి రోజుల్లో ఉండేది. ఆయన దేశంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇందిర ఇంటిని విద్యార్థులు ముట్టడించాలని, ఒక ఏడాది చదువు పోయినా విద్యార్థులు పోరాటానికి రోడ్లపైకి రావాలని, మిలటరీ, పోలీస్ ప్రభుత్వ ఆదేశాలను పాటించరాదంటూ పిలుపునిచ్చారు జెపి. మరో పక్క మొరార్జీ దేశాయి ఒక విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందిర ఇంటిని అష్టదిగ్బంధనం చేసే యోచన చేస్తున్నామని చెప్పడంతో ప్రజలు ఇచ్చిన పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలో వున్న ఇందిర క్యాబినెట్ తో చర్చించి రాజ్యాంగం లో వున్న ఆర్టికల్ 352 అంతర్గత అత్యవసర పరిస్థితి విధించే అవకాశాన్ని వినియోగించారు.’’ అని వివరించారు ఉండవల్లి.

జెపి కి బేడీలు వేసేందుకే …

‘‘జెపి వంటి టవరింగ్ పర్సనాలిటీని అరెస్ట్ చేస్తే దేశం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఆనాటిది. అదే దేశమంతా ఎమర్జెన్సీ విధిస్తే అందరితో పాటు ఆయన అరెస్ట్. అది తప్ప ఇందిర కు ఆనాడు గత్యంతరం లేని పరిస్థితి. ఆమె స్థానంలో వున్నవారు ఎవరైనా అదే చేసే అవకాశం వుంది. వేరే అవకాశాలు ఏమున్నాయో రాజకీయ విశ్లేషకులు ఇంతవరకు చెప్పలేదు’’. అందుకే తన అభిప్రాయాలు తెలియచేస్తున్నా అన్నారు అరుణ కుమార్ . 43 ఏళ్ళు అయినా గత్యంతరం లేని స్థితిలో ఇందిర అత్యవసర పరిస్థితి విధిస్తే తరువాత పార్లమెంట్లో ప్రశ్నించారని, పెద్ద చర్చే నేటికీ నడుస్తుంటే అశాస్త్రీయమైన ఆంధ్రప్రదేశ్ విభజనను ఎందుకు టిడిపి, వైసిపి నోటిస్ ఇచ్చి ప్రశ్నించడం లేదన్నారు మాజీ ఎంపి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1632 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*