ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

uttamkumarreddy-indian-national-congress

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆశావహులు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు.

పీసీసీ అధ్యక్షుడిగా….

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన హయాంలో వచ్చిన ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తమ్ వ్యవహరించిన తీరును సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. కూటమి కట్టకుండా ఒంటరిగా పోటీ చేసినా ఇన్ని సీట్లు దక్కేవని ఆయనపై సెటైర్లు వేసేవారు కూడా లేకపోలేదు. వ్యూహాత్మక తప్పిదాల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని, కేసీఆర్ ఎత్తులకు పైఎత్తులు వేయడంలో పీసీసీ విఫలమయిందన్న వాదనలు కూడా ఉన్నాయి.

ఇష్టం లేకున్నా….

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ఏకపక్షంగా జరిగిందన్న విమర్శలున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పదవీకాలం మామూలుగా మూడేళ్లు ఉంటుంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చడం ఇష్టంలేని హైకమాండ్ ఆయననే కొనసాగించింది. ఇప్పడు ఉత్తమ్ ను మార్చాల్సిన అవసరం వచ్చింది. పీసీసీని పూర్తిగా ప్రక్షాళలన చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పీఠాన్ని కొట్టేసేందుకు అనేక మంది ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఎవరిని దించుతారో…?

సమర్థవంతమైన నేతను, ముందుగా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడినే ఎంపిక చేయాలని క్యాడర్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పేర్లు పీసీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా విన్పిస్తున్నాయి. దీంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్ల తెలుస్తోంది. అయితే పీసీసీతో పాటు పార్టీ ఇన్ ఛార్జి కుంతియాను కూడా మార్చాలన్న డిమాండ్ వినపడుతోంది. మొత్తం మీద ఉత్తమ్ కు ఊస్టింగ్ ఖాయమని దాదాపుగా తేలిపోయింది. మరి కొత్త పీసీసీ అధ్యక్షుడెవరనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Ravi Batchali
About Ravi Batchali 19203 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*