
బెజవాడ నేత వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి నారా చంద్రబాబునాయుడు నివాసానికి చేరుకున్నారు. దాదాపు రెండు నెలల క్రితం వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీలో చేరికపై అనుచరులు, ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంటు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొనకళ్ల నారాయణను అసెంబ్లీ బరిలోకి దించుతారన్న ప్రచారం జరుగుతుంది.
Leave a Reply