ఆమెను థిక్కరించే సాహసం ఉందా?

ఆమె మాటే శాసనం. ఆమెకు తిరుగులేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా పార్టీ ఆమె నిర్ణయానికి శిరసావహించాల్సి వచ్చింది. ఆమె రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే. రాజస్థాన్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయాత్తం కావాల్సిన సమయం ఇది. ఇదే సమయంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన నాయకుడు కావాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నేత కావాలి. అయితే గత కొద్ది రోజులుగా రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడి నియామకం బేజేపీ కేంద్ర నాయకత్వం చేపట్టలేకపోయింది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

వ్యతిరేకత ఉన్నప్పటికీ…..

రాజస్థాన్ లో వసుంధర రాజే పాలన మీద ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు. సొంత పార్టీలోనూ అసమ్మతి బాగా ఉంది. మరోవైపు ఉప ఎన్నికల్లో ఓటమితో రాజేపై తిరుగుబాటు కూడా చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రాజేను తప్పించాలని ఏకంగా ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాశారు. వచ్చే ఎన్నికల వరకూ రాజేనే కొనసాగిస్తే ఓటమి తప్పదని అధిష్టానానికి హెచ్చరించారు. అయినా అధిష్టానం మాత్రం కిమ్మన లేదు. రాజేనుమార్చే సాహసం చేయలేదు. ఆమె తన విధానాలను మార్చుకోలేదు. వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలన్న ఉద్దేశ్యంతో కమలనాధులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

తనకు అనుకూలంగా ఉండే….

ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా వివాదాస్పదమయింది. బీజేపీ అధిష్టానం ఎంపికను ఒక దశలో రాజే వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే రాష్ట్ర అధ్యక్షుడు తనకు అనుకూలంగా ఉండే వ్యక్తినే నియమించాలని పట్టుబట్టారు. దీంతో అధిష్టానందిగి వచ్చింది. వసుంధర రాజేతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరపిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా మదన్ లాల్ సైనీని నియమించారు. మదన్ లాల్ సైనీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

అన్ని వర్గాలను సంతృప్తి పర్చేలా…..

రాజస్థాన్ లో జాట్, రాజ్ పుత్ వర్గాలదే ప్రాబల్యం. దీంతో ఈ రెండు సామాజికవర్గాల్లో ఎవరిని నియమించినా ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో మాలీ వర్గానికి చెందిన మదన్ లాల్ సైనీని నియమించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నేతృత్వం వహిస్తున్న అశోక్ గెహ్లెట్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. వాస్తవానికి గజేంద్ర సింగ్ కు అమిత్ షా రాష్ట్ర బాధ్యతలను అప్పగించాలనుకున్నారు. కాని వసుంధర రాజే అడ్డం తిరగడంతో సైనీని నియమించారు. రాజస్థాన్ లో ఈ ఏడాది 180 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 25 లోక్ సభ స్థానాలున్నాయి. మరి సైనీ, రాజేల కాంబినేషన్ వచ్చే ఎన్నికల్లో వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 35875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*