జగన్ ఇక్కడ అడుగుపెట్టలేరా …?

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టనికోట గా ఆదినుంచి అండగా వుంటూ వస్తుంది. అతికొద్ది సందర్భాల్లో తప్ప ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు లేవు. మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం నియోజకవర్గాలు ఉంటాయి. రాజమండ్రి పార్లమెంట్ పరిధినుంచి 2009 లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపొందారు. దాంతో పాటు అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికే ఏ పార్టీ అయినా టికెట్లు ఇచ్చే సంప్రదాయం ఇక్కడ నడుస్తుంది.

వారిదే ఇక్కడి రాజ్యం …

కాపు, బిసి సామాజిక వర్గాల ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా కమ్మ సామాజిక వర్గమే అన్ని పార్టీల్లో ఈ నియోజకవర్గంలో చురుగ్గా కొనసాగుతుంది. ఆర్ధిక అంగ బలాలు ఉండటం ఆ వర్గానికి చెందినవారికి ఇక్కడ అధికంగా ఉండటంతో అన్ని పార్టీలు వారికే అగ్రతాంబూలం ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. ఒకప్పుడు ఆలమూరు నియోజకవర్గంలో వున్నప్పుడు మాజీమంత్రి సంగీత వెంకటరెడ్డి ( చిన్నకాపు ) కాపు సామాజిక వర్గం తరపున రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ లో చక్రం తిప్పేవారు. ఇక కపిలేశ్వరం జమిందార్లు అయిన ఎస్ బి పి బి కె సత్యనారాయణ రావు సోదరులు ఎంపీలుగా పలుమార్లు గెలిచి కేంద్రమంత్రులుగా రాణించారు. వ్యవసాయం, రైసుమిల్లులతో రాష్ట్రంలోనే మండపేటకు ఆర్ధిక పరిపుష్టి వున్న ప్రాంతంగా గుర్తింపు వుంది.

2009 నుంచి జోగేశ్వర రావు దే హవా …

మండపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్యెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు 2009 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. 2014 లో కూడా ఆయనే గెలిచి ఇక్కడినుంచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తనకన్నా రాజకీయాల్లో సీనియర్లు అయిన వివిఎస్ చౌదరి, బిక్కిన కృష్ణార్జున చౌదరిలు రాజకీయాలను అధిగమించి ఒక ప్రత్యేకతను తెచ్చుకున్నారు జోగుళ్ళ. నియోజకవర్గ ప్రజల్లో మమేకం కావడంతో పాటు వివాదరహితుడిగా కొనసాగడం ఆయన ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవొచ్చు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం గాల్లో అంతా జోగేశ్వర రావు కి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని లెక్కేసినా జిల్లా అంతా వీచిన కాంగ్రెస్ గాలికి ఎదురొడ్డి మరి ఆయన 26571 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి వివిఎస్ పై గెలుపొందారు. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఇక 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి, జనసేన సంకీర్ణ భాగస్వామ్యంలో రెండో సారి 36014 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి గిరజాల వెంకటస్వామినాయుడుపై విజయం సాధించారు వేగుళ్ళ.

హ్యాట్రిక్ పై కన్నేసిన …

మూడోసారి కూడా టిడిపి టికెట్ అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించక తప్పని పరిస్థితిని పార్టీలో ఏ ఒక్కరు తనకు ఎదురునిలవని రాజకీయాన్ని నడుపుతున్నారు ఆయన. అయితే రెండుసార్లు గెలిచిన ఆయనపై కొంత వ్యతిరేక గాలి వీస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీదారు వైసిపి నుంచి గట్టిపోటీనే ఎదురయ్యే వాతావరణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసిపి తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన గిరజాలతో పాటు కర్రి పాపారాయుడు టికెట్ కోసం తీవ్రంగా శ్రమించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మరో పక్క గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసిన సినీనటి హేమ ఈసారి జనసన నుంచి బరిలోకి దిగొచ్చన్న టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో మండపేట ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్న ఆసక్తి సర్వత్రా ఎదురౌతుంది.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1662 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*