జగన్ ఊరుకునేటట్లులేరే…?

జగన్

వైసీపీ అధినేత జగన్ తన పార్టీని ఎప్పుడూ హీట్ మీదే ఉంచాలని నిర్ణయించుకున్నట్లుంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లో ఉండేలా పార్టీ కార్యకర్తలకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒకవైపు జగన్ పాదయాత్ర జరుగుతుండగానే ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఇటీవల అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఎంపీల రాజీనామా, ఆమరణ దీక్షలు ఢిల్లీలో జరుగుతుంటే ఏపీలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో సయితం రిలే నిరాహారదీక్షలను జగన్ పార్టీ ప్లాన్ చేసింది.

రెండు రోజుల పాటు…..

ఇక ఇటీవల వైసీపీ విశాఖలో వంచన వ్యతిరేక దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ క్యాడర్ లోనూ, నేతల్లోనూ జోష్ తగ్గకుండా ఉండేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా మళ్లీ రెండు రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని జగన్ నేతలను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీకి జగన్ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇప్పటి వరకూ జగన్ ఎనిమిది జిల్లాల్లో పర్యటించారు. రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయితే మరో వెయ్యి కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంటుంది.

175 నియోజకవర్గాల్లో…..

ప్రస్తుతం కృష్ణా జిల్లా పర్యటనలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 14వ తేదీకి జగన్ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు చేరుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పాదయాత్రలను జగన్ ప్లాన్ చేశారు. చంద్రబాబు పాలన గత నాలుగేళ్లలో ఎలా వైఫల్యం చెందిందీ? ఎన్నికల హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఎలా ప్రజలను మోసగిస్తున్నారన్న విషయాలను ప్రజలకు తెలియజెబుతూ ఈ పాదయాత్రలు అన్ని నియోజకవర్గాల్లో జరగాల్సి ఉంటుంది.

అక్కడే బహిరంగ సభలు…..

రెండు రోజుల పాటు ఈ పాదయాత్రలను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ పాదయాత్రలో విధిగా పాల్గొనాలి. పాదయాత్ర ముగిసిన తర్వాత 13 జిల్లాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లకు పార్టీ తరుపున సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి అక్కడే బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబుపాలనను ఎండగట్టాలని జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. నల్లజెండాలతో పాదయాత్రను నిర్వహించాలని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

Ravi Batchali
About Ravi Batchali 32507 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*