వీరిని జగన్ ఏం చేయలేకపోయారే…!?

వైసీపీ

శ్రీకాకుళం ఎంపీ సీటు వైసీపీకి ఎప్పటికీ దక్కదా? ఈసారి జగన్ సునామీ వచ్చినా కూడా ఎంపీ సీటు మాత్రం చేజారిపోయింది. పొరుగున ఉన్న విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతి రాజు వంటి వారు ఓడిపోయారు. మరి కొత్తగా రాజకీయల్లోకి వచ్చిన రామ్మోహననాయుడుకు అపుడే అంత పట్టు వచ్చిందా. ఈసారి ఎందరో సీనియర్లు ఇంటికెళ్ళిపోయారు. కానీ కింజరపు కుటుంబాన్ని మాత్రం జగన్ గాలి ఏమీ చేయలేకపోయింది. దానికి కారణాలు ఏంటి అన్న చర్చ సాగుతోంది.

లోపాయికారి అవగాహన…..

సిక్కోలులో మొదటి నుంచి రెండు కుటుంబాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. అందులో ఒకటి ధర్మాన, రెండు కింజరపు. ఈ రెండు కుటుంబాల పార్టీలు వేరు. కానీ మంచి అనుబంధం లోపాయికారిగా ఉందని చెబుతారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ ప్రముఖులు పార్టీల కంటే తమ ప్రయోజనాలను చూసుకుంటారని అంటున్నారు. ఈసారి ఓ వైపు జగన్ సునామీ, మరో వైపు బలమైన సామాజిక వర్గం కాళింగులు కూడా అధికార పార్టీ మీద తిరుగుబాటు చేశారు. దాని ఫలితం జిల్లా అంతటా కనిపించింది కానీ కింజరపు కుటుంబంలో బాబాయి. అబ్బాయి మాత్రం అనూహ్యంగా గెలిచేశారు. ఈసారి అచ్చెన్నాయుడు ఓడిపోతారని అనుకున్నారు. అలాగే ఎంపీ రామ్మోహన్ కూడా గెలవరని డిసైడ్ అయ్యారు. అయితే అతి తక్కువ మెజారిటీతో ఇద్దరూ బయటపడ్డారు. దీని వెనక వారికి ప్రత్యర్ధి పార్టీ నుంచే సహకారం లభించిందని వినిపిస్తోంది.

ఆ ముగ్గురూ బలయ్యారే…..

ఈ లోపాయికారి రాజకీయానికి శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్ధి గుండా లక్ష్మీ దేవి, టెక్కలిలో వైసీపీ అభ్యర్ధి పేరాడ తిలక్, శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ బలి అయ్యారని అంటున్నారు. ఈ రాజకీయ చదరంగంలో వీరు చిక్కుకుపోయారని వినిపిస్తోంది. ఇక గత ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి ఓటమి వెనక కూడా వైసీపీలోని కొందరు పెద్దలు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. మరి వైసీపీ హై కమండ్ కి ఇవన్నీ తెలిసి కూడా అలెర్ట్ కాలేదా అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి గెలుపు అంచుల దాకా వచ్చి టెక్కలి. సిక్కోలు ఎంపీ సీట్లను వైసీపీ పోగొట్టుకుంది.

Ravi Batchali
About Ravi Batchali 40560 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*